ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యంపై శ్రద్ధ చూపిస్తారు. అబ్బాయిలు కాస్త తక్కువే
అయినా అమ్మాయిలు మాత్రం రోజులో దీనికి కొంత సమయం కూడా కేటాయిస్తారు. అలాంటి
వారు అద్దంలా మెరిసే, కాంతివంతమైన చర్మం కోసం ఈ ఫ్రూట్ ప్యాక్స్ వాడటం మంచిది.
*అవకాడో:
మొదట అవకాడోను గుజ్జులా చేయాలి. తర్వాత దీనికి అలోవెరా జెల్ కలిపి మిశ్రమంగా
చేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.
*స్ట్రా బెర్రీ:
స్ట్రాబెర్రీ గుజ్జును తీసుకుని దీనికి కొంచెం తేనె, కోకో పౌడర్ కలిపి
మిశ్రమంగా తయారు చేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్
చేసుకుంటే ఫలితం ఉంటుంది.
*నారింజ:
నారింజ పండు గుజ్జుకు కాస్త పసుపు, తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై
చేసి 10 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత క్లీన్ చేసుకోండి
*మామిడి:
మామిడిని గుజ్జులా చేసి దానికి కొంచెం రోజ్ వాటర్, యోగర్ట్ కలిపి మిశ్రమంలా
తయారు చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత
క్లీన్ చేసుకోండి.
*పుచ్చకాయ:
పుచ్చకాయను పేస్ట్ లా చేసి దీనికి యోగర్ట్ కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఆ
తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
*అరటి:
అరటి పండు గుజ్జును తీసుకుని దానికి కొంచెం పసుపు, యోగర్ట్ కలిపి పేస్ట్‌గా
తయారు చేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్
చేసుకోవాలి.
*కివీ:
కివీ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో సహాయపడుతుంది. కివీ గుజ్జును
తీసుకుని దానికి కోడిగుడ్డు పచ్చసొన, ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమంగా
తయారుచేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
*బొప్పాయి:
బొప్పాయిని పేస్ట్ చేసి దీనికి కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి
అప్లై చేసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ఫలితం ఉంటుంది.