న్యూఢిల్లీ : చంద్రయాన్-3కి ప్రధాని నరేంద్ర మోడీ గుడ్‌లక్ చెప్పారు. భారత
అంతరిక్ష రంగంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థ
ఇస్రో శుక్రవారం అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది.
అంతా సాఫీగా సాగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్.. 140
కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది.
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ తో సహా పలు రంగాల నుంచి ‘గుడ్ లక్ ’ సందేశాలు
వస్తున్నాయి. ‘అంతరిక్ష రంగంలో జులై 14,2023 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు.
చంద్రుడిపైకి చంద్రయాన్-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది
భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుందని మోదీ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో
జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘చంద్రయాన్-1
ప్రయోగం ముందువరకు చందమామపై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని అభిప్రాయపడేవారు.
కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది. ఇక ఇది భవిష్యత్తులో జనావాసంగా మారొచ్చు’అని
ఆకాక్షించారు. అలాగే తాజా ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని
కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి
ప్రస్తుత ప్రయోగంపై దృష్టి సారించారు.