మూడు దశలుగా సమావేశాలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం కు ధన్యవాదాలు
* 92 రోజుల పోరాటం నిజయాతీగా ఉద్యోగుల పక్షాణే పోరాడి అనేక ఆర్దిక,ఆర్దికేతర
అంశాలు పరిష్కరించుకున్నాం*
అతి తక్కువ వేతనాలు పొందే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రధానంగా క్లాస్ -4
స్థాయి ఉద్యోగులకు రైస్ కార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి
1-9-2004 ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ నిబంధనల
మేరకు ఓపియస్ విధానం వారికి అమలు చేయాలి
ఉద్యమం విరమించినా సరే నిరంతరం ఉద్యోగుల సమస్యలు పరిష్కానికి, కాంట్రాక్టు,
ఔట్ సోర్శింగు ఉద్యోగుల హక్కుల సాదన కోసం కృషిచేస్తూనే ఉంటాం
ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి కి, సియస్ కి ధన్యవాదాలు
ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం 60 రోజుల్లో కేబినెట్ ఆమోదించిన ప్రధాన అంశాలపై
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి
బొప్పరాజు వెంకటేశ్వర్లు & పలిశెట్టి దామోదరరావు
కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక,
రిటైర్డు,కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు
పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపి ఆర్దిక, ఆర్దికేతర సమస్యలు పరిష్కరం
వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి ఇచ్చిన పిలుపు
మేరకు లక్షలాధిమంది ఉద్యోగుల ప్రయోజనాల కాపాడుకొనేందుకు 92 రోజులు
మండుటెండలలో అలుపెరుగని పోరాటాలు చేసి ఉద్యోగులలో ఆనందాన్ని నింపినందుకు,ఈ
ఉద్యమం విజయవంతం కావడానికి కారకులైన జిల్లా స్దాయి ఏపిజెఏసి అమరావతి నాయకులను,
కార్యకర్థలను రాష్ట్రకమిటి నుండి అభినందించేందుకు ఆదివారం కడప రెవిన్యూ భవన్
లో కడప జిల్లా చైర్మన్ జీవన్ అద్యక్షతన కడప జోన్ 4 లో ఉన్న అన్ని జిల్లాల
ఏపిజెఏసి జిల్లా చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు జెఏసి కమిటి, అనుబంద సంఘాల
నాయకులతో ఆదివారం కడప రెవిన్యూ భవన్ లో అభినందన సభ జరిగింది. ఈ సమావేశంలో
ముఖ్య అతిధులుగా ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజువెంకటేశ్వర్లు,
సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేసిన
నాయకులందరినీ శాలువాలు,పూలదండలు వేసి, మెమోంటోలు అందజేసి సత్కరించి
అభినందించారు.
నిజాయితీగా, దైర్యంగా ఏపిజెఏసి అమరావతి నాయకత్వం ఒంటరిగానే చేపట్టిన ఉద్యమ
ఫలితంగా ప్రభుత్వం స్పందించి ఏపి జెఏసీ అమవారతీ రాష్ట్రకమిటి ఇచ్చిన
మెమోరాండంలో ఉన్న 48 డిమాండ్లులో 37 డిమాండ్లును పరిష్కరించడం జరిగింది.ఇంతటి
విజయానికి కారణం ఉద్యమానికీ అండగా నిలిచిన ఉద్యోగులే..! అందుకే ఈ ఉద్యమాన్ని
ఉద్యోగులంధరి విజయంగా పరిగణిస్తూ ఇది మనందరి విజయం కావున ఈ విజయాన్ని
ఉద్యోగులకే అంకితం చేస్తున్నామని జెఏసి నాయకులు బొప్పరాజు
వెంకటేశ్వర్లు,పలిశెట్టి దామోదరరావు అన్నారు. 94 డిపార్ట్మెంట్ సంఘాల కలయికతో
ఏర్పడిన ఏపి జెఏసి అమరావతి లో అనేక డిపార్ట్మెంట్ కు చెందిన ప్రధానంగా
ఆర్టీసీ, రెవెన్యూ, మునిసిపల్, గ్రామ వార్డ్ సచివాలయం తదితర శాఖల ఉద్యోగులు
సమస్యలు పరిష్కరించుకున్నామని, అనేక శాఖల్లోని అనేకమంది కరోనా ముందు, కరోనా
కాలం, కరోనా తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుంబం లోని సభ్యులకు కారుణ్య
నియామకాలు పొందేందుకు అవకాశం కలిగింది. ఈ ఉద్యమం ఫలితంగా ఉద్యోగుల సమస్యలు
ఇంత వరకూ పేరుకు పోవడానికి కారణం ఆయా డిపార్టుమెంటు విభాగాల అధిపతులు ఆయా
ఉద్యోగ సంఘాలతో సమావేశాలు పెట్టక పోవడమే కారణమని ఈనెల 13 న ముఖ్యమంత్రి తో
జరిగిన చర్చలు సందర్బంగా చెప్పగానే, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, సిఎస్ కి
తక్షణమే అన్ని డిపార్టుమెంట్లు లలో ఆ డిపార్టుమెంటు ఉద్యోగసంఘాలతో సమావేశాలు
నిర్వహించాలని ఆసమావేశంలోనే ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ముఖ్యమంత్రి
ఆదేశించినందువల్లనే ఈనెలలో 23, 27, 30, తేదీలలో సమావేశాలు నిర్వహించేలా ఛీఫ్
సెక్రటరీ ఆదేశాలు కూడా జారీ చేయడం, ఇప్పటికే 23వ తేదీన చాలా శాఖాధిపతులు
సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇంకా 27వ తేదీ కొన్ని శాఖలు సమావేశాలు
జరుగుతుండ డం అభినందనీయమన్నారు. ఇదే పద్దతిలో జిల్లాలలో జిల్లా కలెక్టర్లు
గుంటూరు జిల్లా కలెక్టర్ మాదిరి జిల్లా స్దాయి అధికారులతో కలిపి ప్రత్యేకంగా
“ఉద్యోగుల గ్రీవెన్సు డే” నిర్వహించి, అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలతో సమావేశాలు
ఏర్పాటు చేసేలా కూడా చూడాలని సిఎస్ కి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన లేఖను
అందజేయడం జరిగిందన్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సీ ఎఫ్ ఎం ఎస్ లో
ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి నందున ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
సీ ఎఫ్ ఎం ఎస్ లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి నందున వారికి, వారి కుటుంబ
సబ్యులకు కూడా రేషన్ కార్డులతోపాటు ప్రభుత్వ సంక్షేమ పధకాలు కూడా రద్దు
చేసినందున తిరిగి వాటిని పునరుధ్దరీంచాలని కోరడం జరిగింది. అతి తక్కువ వేతనాలు
పొందే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రధానంగా క్లాస్ -4 స్థాయి ఉద్యోగులకు రైస్
కార్డులు మరియు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి. 1-9-2004 ముందు నియామక
ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు ప్రధానంగా ఈ రాష్ట్రంలో డిఎస్సీ -2003 టీచర్ల
రిక్రూట్మెంట్, 2003- పోలీసు రిక్రూట్మెంట్, గ్రూప్ -2 రిక్రూట్మెంట్
ఉద్యోగులు సుమారు 9,300 మంది కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే ఓపియస్
విధానం వారికి అమలు చేయాలని కోరారు.
ఉద్యమం విరమించినా సరే నిరంతరం ఉద్యోగుల సమస్యలు పరిష్కానికి, కాంట్రాక్టు,
ఔట్ సోర్శింగు ఉద్యోగుల హక్కుల సాదన కోసం కృషిచేస్తూనే ఉంటామని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 60 రోజుల్లో కేబినెట్ ఆమోదించిన ప్రధాన అంశాలపై
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని సిఎస్ కి మా సమక్షంలోనే సీఎం జారీ చేశారు.
ఈ 92 రోజుల ఉద్యమంలో జిల్లా పర్యటనల ద్వారా ఎన్నో డిపార్టుమెంట్లు,
కార్పురేషన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధాన స్కీమ్సు తో నడుస్తున్న
సంస్దలలో అనేకమంది ఔట్ స్సోర్సింగు ఉద్యోగుల బాదలను, ఆవేదనను, మునిసిపల్
కార్మికులు /ఉద్యోగుల బాధలను, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల బాధలను
తెలుకోగలిగాం. భవిష్యత్ లో వారి సమస్యల పరిష్కారం కోసం ఏపిజెఏసి అమరావతి
నాయకత్వం నిరంతరం కృషిచేస్తునే ఉంటుందని బొప్పరాజు,పలిశెట్టి దామోదరరావు హామి
ఇచ్చారు.
ఈసమావేశంలో ఏపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు కడప జిల్లా చైర్మన్ ఆర్. జీవన్
చంధ్రశేఖర్, ప్రధానకార్యదర్శి కె.కె.కుమార్ ను, కర్నూలు జిల్లా చైర్మన్
వి.గిరికుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి కృష్ట, అన్నమయ్యజిల్లా చైర్మన్
నరశింహకుమార్, వారి ప్రధానకార్యదర్శి, అనంతపురం జిల్లా చైర్మన్ దయాకర్ ,
ప్రధాన కార్యదర్శి పి.యస్.ఖాన్, సత్యసాయి జిల్లా చైర్మన్ మొహినుద్దీన్ ,
ప్రధానకార్యదర్శి జి.వై.పి.రావు తో పాటు ఆయా జిల్లా నాయకులందరిని ఏపిపిటిడి
(ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, ఉప
ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రభాకర్, జోనల్ కార్యదర్శి యన్.రాజశేఖర్ ను ఈ అభినందన
సభలలో సత్కరించారు. అలాగే ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్లాస్ 4 ఎంప్లాయీస్
రాష్ట అద్యక్షులు యస్.మల్లేశ్వరరావు,గ్రామవార్డు సచివాలయ సంఘం
రాష్ట్రఅధ్యక్షులు ఏ.అరలయ్య,టైపిస్టుల సంఘం రాష్ట్రఅధ్యక్షులు శంకర్
నాయక్,జెఏసి కోశాధికారి రోనాల్డు తదితర నాయకులు పాల్గొన్నారు.