ఉష్ణోగ్రతల కారణంగా.. డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కాబోయే తల్లులు.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. ఈ టైమ్లో
పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం, పుట్టబోయే
బిడ్డ ఎదుగుదల రెండింటిపై శ్రద్ధ వహించాలి. వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు వారి
డైట్లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
గర్భధారణ సమయంలో గుడ్డు తీసుకోవచ్చు. ఇందులో ప్రొటీన్లు ఉంటాయి. పిండం
ఎదుగుదలకు, కణజాలాల పెరుగుదలకు, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి
యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడానికి.. ప్రొటీన్ చాలా అవసరం. ప్రొటీన్ కడుపులోని
బిడ్డ అస్థిపంజరం, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తాయి.
గుడ్డులో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తినాలని
పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆకుకూరల్లో.. విటమిన్ సి, ఇ, కె
పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో..
మలబద్ధకం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫైబర్ మలబద్ధకం సమస్యకు చెక్
పెడుతుంది. ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు సలాడ్స్,
కూరల్లో ఆకుకూరలు చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు..
వారి ఆహారంలో సరిపడా కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
కార్బోహైడ్రేట్లు పొందడానికి, ప్రెగ్నెన్సీ సమయంలో.. తృణధాన్యాలు తీసుకుంటే
మంచిది. తృణధ్యాన్యాలు.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి.