కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. బుధవారం
తెల్లవారుజామున ఒడెసా నగరం, తూర్పు దొనెట్ ప్రాంతంపై క్రూజ్ క్షిపణులతో
విరుచుకుపడింది. దీంతో ఆరుగురు పౌరులు మృతి చెందారు. పలు గృహాలూ ధ్వంసమైనట్లు
ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఒడెసాలో జరిగిన దాడిలో ఆహార ధాన్యాల
గోదాము ఉద్యోగులు ముగ్గురు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారని, ఇక్కడ
కొన్ని ఇళ్లతో పాటు కేఫ్‌లు నాశనమైనట్లు అధికారులు తెలిపారు. గోదాము
శిథిలాల్లో ఎవరైనా సజీవంగా ఉన్నారేమోనని సహాయబృందాలు గాలింపు సాగిస్తున్నాయి.
నల్ల సముద్రం నుంచి ఒడెసాపై రష్యా నాలుగు కాలిబర్ క్రూజ్ క్షిపణుల ద్వారా
దాడులకు దిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాటిలో మూడింటిని గగనతల రక్షణ
వ్యవస్థలు కూల్చివేశాయన్నారు. తమ ప్రాంతంపై జరిగిన దాడిలో ముగ్గురు
మరణించినట్లు దొనెట్స్క్ రాష్ట్ర గవర్నర్ పావ్లో కిరిలెంకో టెలిగ్రామ్
ద్వారా తెలిపారు. క్రమటోర్స్క్, కోస్టియాంటినివ్కా నగరాల్లో ఏడు గృహాలు
నేలమట్టమయ్యాయని, మరో 12 ఇళ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. అయితే మొత్తం 57
నివాసాలు దెబ్బతిన్నాయని అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా రష్యా
ఆక్రమించిన తమ దేశానికి చెందిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో
నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నామని ఉక్రెయిన్ రక్షణశాఖ ఉపమంత్రి హన్నా
మలియర్ బుధవారం తెలిపారు. ఇప్పటి వరకూ బఖ్‌ముత్‌లో 200 నుంచి 500 మీటర్లు,
జపొరిజియా ప్రాంతంలో 300 నుంచి 350 మీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు
ఆమె వెల్లడించారు.