150 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం
కీవ్ : దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్-సుక్-యోల్ శనివారం ఉక్రెయిన్ను
ఆకస్మికంగా సందర్శించారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఆ దేశానికి మద్దతును
ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
150 మిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. రష్యా దాడి తర్వాత
ఉక్రెయిన్లో దక్షిణకొరియా అధ్యక్షుడు పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్
సైన్యానికి కావాల్సిన హెల్మెట్లు, శరీర కవచాలు భారీఎత్తున సరఫరా చేస్తామని
హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు తమ దేశం అండగా
నిలుస్తుందని చెప్పారు.