ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖకు చెందిన
పెంటగాన్ ధ్రువీకరించింది. రష్యా దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా
ఈ ఆయుధాలను కీవ్‌కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది. దీనిపై
గత వారం అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకోడానికి కొన్ని నెలల ముందే..
అమెరికా అధికారులు వీటి సరఫరాపై మల్లగుల్లాలు పడ్డారు. సాధారణంగా క్లస్టర్
ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటి లోపల ఉన్న చిన్న బాంబులెట్స్
(బాంబులు) ఆ ప్రాంతం మొత్తం వెదజల్లుతాయి. వీటిలో కొన్ని పేలవు. వాటి శాతాన్ని
డడ్రేట్గా పేర్కొంటారు. ఇలాంటి బాంబులు అలాగే ఉండిపోయి యుద్ధం ముగిసిన
తర్వాత ఆ ప్రాంతంలో జనసంచారం పెరిగిన సమయంలో పేలి ప్రమాదాలకు కారణం అవుతాయి.
తాజాగా తాము సరఫరా చేసే క్లస్టర్ ఆయుధాల్లో డడ్రేట్ను గణనీయంగా తగ్గించామని
అమెరికా చెబుతోంది. వేలసంఖ్యలో వీటిని ఉక్రెయిన్‌కు ఇస్తామని పెంటగాన్
చెబుతున్నా కచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. అమెరికా చివరిసారిగా 2003
నాటి ఇరాక్ యుద్ధంలో వీటిని ఉపయోగించింది. తర్వాత నుంచి వాటి వినియోగాన్ని
ఆపేసింది. అప్పటి నుంచి అమెరికాలో భారీస్థాయిలో ఈ క్లస్టర్ ఆయుధాలు
పేరుకుపోయాయి. ఇవి దాదాపు 30 లక్షలదాకా ఉన్నట్లు సమాచారం. వాటన్నింటినీ
ఇప్పుడు ఉక్రెయిన్‌కు సరఫరా చేయటం ద్వారా అమెరికా వదిలించుకుంటోంది.
పెంటగాన్‌కు చెందిన డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ డగ్లస్
సిమ్స్ మాట్లాడుతూ క్లసర్ ఆయుధాలు ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందించాం. కానీ,
వాటిని కీవ్ దళాలు వాడాయో, లేదో తెలియదని పేర్కొన్నారు. మరోవైపు మానవహక్కుల
సంస్థ మాత్రం బైడెన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ క్లస్టర్ ఆయుధాల
వల్ల 2021లో ప్రపంచవ్యాప్తంగా 149 మంది అమాయక పౌరులు మరణించడమో, గాయపడటమో
జరిగిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 120 దేశాలు క్లస్టర్ ఆయుధాల
నిషేధ ఒప్పందంపై సంతకాలు చేశాయి. వీటిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మాత్రం
లేవు. ఈ యుద్ధంలో ఇప్పటికే రష్యా ఈ ఆయుధాలను వినియోగిస్తోందని ఉక్రెయిన్
ఆరోపిస్తోంది.ఉక్రెయిన్ చేరిన క్లస్టర్ ఆయుధాలు
ఉక్రెయిన్ : యుద్ధభూమిలో అతి భారీస్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్

ఆరోపిస్తోంది.