సూర్యాపేట : కేంద్రం తాజాగా తీసుకొచ్చినా నూతన జాతీయ విద్యుత్ విధానంపై మంత్రి
జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా
విద్యుత్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేటలో జరిగిన మీడియా సమావేశంలో
ఆయన ఈ విధంగా బదులిచ్చారు. దేశమంతా 2022 నుంచి 2032 వరకు వచ్చే పదేళ్ల పాటు
అమలు చేసేందుకు నూతన జాతీయ విద్యుత్ విధానం ముసాయిదాను కేంద్రం రాష్ట్ర
ప్రభుత్వాలకు పంపించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత విద్యుత్‌పై వెనక్కి తగ్గేది లేదని
స్పష్టం చేశారు. ఈ సంస్కరణలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ తన మాటను చెప్పారని
తెలిపారు. సూర్యాపేటలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కేంద్రం
తీరుపై మండిపడ్డారు.
దేశంలో ఉన్న వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక, ఆర్థిక
సమతుల్యం లేని వర్గాలకు తప్పకుండా సబ్సిడీలు ఉండాలని బీఆర్ఎస్ భావిస్తోందని
మంత్రి అన్నారు. పేద ప్రజలకు అందించే ఉచిత విద్యుత్తు నిలిపేందుకు కేంద్రం
కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ విధానాన్ని ఎట్టి
పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
కొందరిని పెంచే.. కోట్ల మందిని ముంచే ప్రభుత్వం
కేంద్రంలోని బీజేపీ కొందరిని పెంచే కోట్ల మందిని ముంచేదిగా పాలన సాగిస్తుందని
ఆరోపించారు. రైతులకు అందించేది విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల
ప్రోత్సాహకాలు అందిస్తుండగా కేంద్రం దాన్ని ఉచిత విద్యుత్‌గా పేర్కొంటూ
తొలగించాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఉన్నంతవరకు వ్యవసాయానికి
ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని మంత్రి ప్రకటించారు. రైతులు అన్ని విధాలుగా
చతికిపడిపోయి ఉన్నారు. కావున వీరికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తామని
పేర్కొన్నారు.
సామాజిక, ఆర్థిక సమతుల్యంలేని దేశంలో సబ్సిడీలు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్
భావిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం
కోసమే కేంద్రం ఎత్తులు వేస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్రం ఫ్యూడల్ ఆలోచనలతో
పేదలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటార్లకు
మీటర్లు పెట్టాలనే దుర్మార్గపు ఆలోచన కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి
జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
“నూతన జాతీయ విద్యుత్ సంస్కరణలపై నాడే సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు.
భారతదేశంలో ఉన్న వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని, సబ్సిడీలు,
ప్రోత్సాహకాలు వంటిపి కచ్చితంగా అవసరమే అని బలంగా నమ్మే నాయకుడు కేసీఆర్.
కొన్ని వర్గాలకు ఉచితంగా కరెంట్‌ను అందిస్తున్నారు. కేంద్రం మోటరుకు మీటరు
ఉంచాలని భావిస్తుంది. ఇది తెలంగాణలో జరగదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
జగదీశ్ రెడ్డి అన్నారు.