53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో ఆదివారం ఘనంగా
ప్రారంభమైంది. పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్
స్టేడియంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమాచార,
ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్
హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ వేడుకల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రత్యేక
ఆకర్షణగా నిలిచాడు. ఆయనను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అజయ్ దేవగన్ తో పాటు
పరేష్ రావల్, సునీల్ శెట్టి, మనోజ్ బాజ్‌పేయి, ప్రముఖ రచయిత విజయేంద్ర
ప్రసాద్‌తో సహా చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను అనేక మందిని
సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ విలేకరులతో మాట్లాడాడు. ఎవరూ ఎవరికీ
సలహా ఇవ్వలేరన్నారు. సలహా ఇచ్చే బదులుగా ప్రజలు తమపై తాము ఆధారపడాలని
పిలుపునిచ్చారు.