నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో మెహిది హసన్ (38 నాటౌట్),
ముస్తాఫిజుర్ (10 నాటౌట్) అభేద్యమైన చివరి వికెట్‌కు 51 పరుగులు జోడించి
బంగ్లాదేశ్‌కు మరుపురాని విజయాన్ని అందించారు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా
ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు వికెట్ తేడాతో భారత జట్టుపై
సంచలన విజయం సాధించింది. కీలక సమయంలో మెహిది హసన్ రెండు సిక్స్‌లు,
నాలుగు ఫోర్లతో 38 పరుగులు చేసి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. బంగ్లాదేశ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 186 పరుగులు
చేసి 41.2 ఓవర్లకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో టీమిండియా పూర్తిగా విఫలమైంది.
ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే 73 పరుగులతో రాణించాడు. కానీ.. అదే కేఎల్ రాహుల్
కీలక సమయంలో క్యాచ్ చేజార్చి టీమిండియా గెలిచే మ్యాచ్‌ను కాస్తా తలకిందులు
చేశాడు. ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ జట్టు ఘన విజయం సాధించింది.
టీమిండియా 41.2 ఓవర్లకు 186 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 187 పరుగుల స్వల్ప
లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. బౌలింగ్‌లో బంగ్లా జట్టు అద్భుతంగా
రాణించిందని చెప్పక తప్పదు. షకీబ్ అల్ హసన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 ఓవర్లు
మేడిన్ చేయడమే కాకుండా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. టీమిండియా కీలక
వికెట్లను పడగొట్టి మన బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. ఎబాడాట్ హుస్సేన్
కూడా 4 వికెట్లతో రాణించాడు. మెహిదీ హసన్ మిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
టీమిండియా 200 పరుగులు కూడా పూర్తి చేయకుండా 186 పరుగులకే చేతులెత్తేసింది.
బ్యాటింగ్‌లో టీమిండియా పూర్తిగా విఫలమైంది. ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే 73
పరుగులతో రాణించాడు. కానీ.. అదే కేఎల్ రాహుల్ కీలక సమయంలో క్యాచ్ చేజార్చి
టీమిండియా గెలిచే మ్యాచ్‌ను కాస్తా తలకిందులు చేశాడు. ఒక్క వికెట్ తేడాతో
బంగ్లాదేశ్ జట్టు ఘన విజయం సాధించింది.