ఈ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’ అవార్డును గెలుచుకుంది. చిరంజీవి
మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రమిది. సుకుమార్ శిష్యుడు
బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయయ్యారు. కథానాయిక కృతిశెట్టికి కూడా తొలి
చిత్రమిదే. నిర్మాణం నుంచే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
సామాజిక అంతరాల నేపథ్యంలో సాగే ఈ కథలోని భావోద్వేగాలు హృదయాల్ని కదిలించాయి.
మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఓ పేదింటి అబ్బాయి. సంపన్న కుటుంబానికి చెందిన
అమ్మాయిని ప్రేమిస్తే వారికి ఎదురైన అడ్డంకులు ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం.
పెద్దింటి అమ్మాయి, పేద అబ్బాయి తరహా ప్రేమకథలు కొత్తేమీ కాకపోయినా ఈ సినిమాలో
చర్చించిన ఓ అంశం ఈ కథను మిగతా ప్రేమకథలకు భిన్నంగా నిలబెట్టింది. ముఖ్యంగా
పతాక ఘట్టాలు భావోద్వేగాలను పంచాయి. ప్రేమకథా చిత్రాల్లో ఓ విభిన్నమైన
ముగింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. దర్శకుడిగా బుచ్చిబాబు తన
తొలి చిత్రంతోనే తన ప్రతిభను చాటాడు. వైష్ణవేజ్, కృతిశెట్టి నటనకు కూడా
అందరిని ఆకట్టుకుంది.