గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు
తల్లిదండ్రులకు వేదన మిగల్చొద్దు
వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ
విమానాశ్రయాన్ని రెండేళ్లలోనే అందుబాటులోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం లక్ష్యంగా పేట్టుకుందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పలు అంశాలపై ఆయన సోషల్ మీడియా
వేదికగా శుక్రవారం స్పందించారు. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా,రూ 5000
కోట్లతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ది చేయనున్నారని వెల్లడించారు. మొదటి దశలో
ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేలా నిర్మాణం చేపట్టనున్నారని, భారీ విమానాలు
దిగేలా 3.8 కి.మీ రన్ వే ఏర్పాటు కానుందని చెప్పారు.ఈ నెల మూడో తారీఖున
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు శ్రీకారం
చుట్టనున్నారని పేర్కొన్నారు.
గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు : మహిళా సాధికారత దిశగా
రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని, వైఎస్ఆస్ చేయూత,ఆసరా,కాపు
నేస్తం,ఈబిసి నేస్తం,సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి మార్గాలను మరింత విస్తృతం
చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారని చెప్పారు.
ఇప్పటి వరకు చేయూత ద్వారా తొమ్మిది లక్షల మందికి స్వయం ఉపాది లభించిందన్నారు.
తల్లిదండ్రులకు వేదన మిగల్చొద్దు : విద్యార్థుల ఆత్మహత్యలపై విజయసాయిరెడ్డి
ఆందోళన వ్యక్తం చేశారు. సాధించాలన్న తపన ఉండాలేగాని ఇవాళ కాకపోతే రేపైనా
సాధ్యమౌతుందని చెప్పారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన
క్షణికావేశానికి లోను కావద్దని విద్యార్ధలకు హితవు పలికారు. ప్రాణంపోతే
తిరిగి రాదని తల్లిదండ్రులకు వేదన మిగల్చొద్దు కోరారు. ఇష్టపడి చదవండి, కలలను
సాకారం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.