చేస్తాయి. వేకువ జామునే ఉత్సాహంగా మేల్కొవాడానికి ఇలా చేయండి..
నీరు:
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే నీరు తాగడం అవసరం. నీరు తాగడంతో హైడ్రేట్ గా
ఉండవచ్చు. ఉదయాన్నే నీరు తాగడంతో నిద్ర మత్తు వదులుతుంది. రోజంతా ఉత్సాహంగా
ఉండవచ్చు.
స్ట్రెచ్చింగ్:
ఉదయాన్నే మేల్కొన్న వెంటనే స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం ఉత్తమం. ఈ
స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడంతో కండరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో రోజంతా
ఉత్సాహంగా, చురుకుగా ఉండవచ్చు.
వ్యాయామం:
ఉదయం లేచిన తర్వాత వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.
వ్యాయామాలు చేయడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సరిగా ఉంటుంది. దీంతో
ఉత్సాహంగా ఉండవచ్చు.
ధ్యానం:
ఉదయం మేల్కొన్న తర్వాత శ్వాసపై ఎక్కువ ధ్యాస ఉంచడం మంచిది. ఎక్కువగా శ్వాసపై
దృష్టి సారించడంలో మానసికంగా దృఢంగా ఉండవచ్చు. ఇందుకోసం ధ్యానం చేయండి.
అల్లారం:
ఉదయం మేల్కొంటున్న సమయంలో అల్లారం ఆఫ్ చేయవద్దు. ఇలా ఆల్లారం ఆఫ్ చేసి
నిద్రపోవడం అనేది సరైనది కాదు. అల్లారం ఆఫ్ చేస్తూ పడుకోవడంతో నెగిటివ్ ఫీల్
కలుగుతుంది.
సూర్యకాంతి:
ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే సూర్యకాంతిలోకి వెళ్లాలి. ఇలా చేయడంతో రోజంతా
ఉత్సాహంగా ఉండవచ్చు. అదే సమయంలో శరీరానికి కావాల్సిన విటమిన్ డీ లభిస్తుంది.
మ్యూజిక్:
ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అనవసరపు శబ్దాలు వినకుండా ఉండేలా చూసుకోండి.
ప్రశాంతమైన మ్యూజిక్ వినేందుకు ప్రయత్నించండి.
స్నానం:
ఉదయం మేల్కొన్న వెంటనే స్నానం చేయడం మంచి అలవాటు. ఇలా చేయడంతో రాత్రిపూట శరీరం
స్రవించిన చెమట తొలగుతుంది. తాజాగా ఉండవచ్చు.