బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఉద్యాన పంటలు రైతుకు ఎంతో లాభదాయ కమ ని కె.వి.కె. అధిపతి డా. బి. గోవింద రాజులు
పేర్కొన్నారు.గురువారం మండలంలోని మున్నూ రు గ్రామంలో రైతు సదస్సు,ఉద్యాన ప్రదర్శన
కృషి విజ్ఞాన కేంద్రం, పెరియవరం, వెంకటగిరి వారు గ్రామీణ ఉద్యాన అవగాహన అనుభవ కార్యక్రమం జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటలు రైతులకు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కవన్నారు.అనంతరం ఉద్యాన కళాశాల, అనంతరజుపేట అసోసియేట్ డీన్ డా. కె. గోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల నమూనాలు గురించి అడిగి తెలుసుకొని, దత్తత రైతులకు ఉద్యాన విద్యార్థులు అందించిన సాంకేతికతను అభినందించారు. ఉద్యాన విద్యా ర్థులు రైతులతో పనిచేసిన విధానాన్ని అభినం దించారు.ఈ కారయక్రమాన్ని కె.వి.కె. ఉద్యాన శాస్త్ర వేత్త డా. డి. తిరుపాల్ నిర్వహించారు. ఈ సదస్సులో ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట
ప్రఫెసర్ డా. రామయ్య, సహాయ అధ్యాపకుడు డా. విరేష్ మరియు కె.వి.కె. శాస్త్రవేత్తలు డా. బి. విజయ శ్రీ, డా. పి. నాగార్జున రెడ్డి, ఐ. రాజీవన మరియు బాలాయపల్లి ఉద్యాన అధికారి ఆనంద రెడ్డి లు, పల్లిపడు, మన్నురు రైతులు, మహిళలు పాల్గొన్నారు .
పోటో:-మాట్లాడుతూన్న డాక్టర్ గోవింద రాజులు