బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఉద్యాన పంటలు రైతులకు ప్రభుత్వం అనేక శసంక్షేమ పథకాలు పంపిణీ చేయడం జరిగిందని
జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరద రామి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మన్నూ రు గ్రామంలో కలెక్షన్ సెంటర్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రస్తుతము జిల్లా వ్యాప్తంగా మామిడి పూత ఆలస్యం అవుతున్నది . దీనికి కారణం పగలు ,రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా 10 – 12 డిగ్రీలు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పూత రావడం జరుగుతుంది కానీ ప్రస్తుతం పగలు,రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా 10 డిగ్రీల కంటే తక్కు వుగా ఉండడం వల్ల పూత రావడం ఆలస్యం అవుతున్నది . కావున పూత రావడానికి , ఇతర పురుగు తెగుళ్ల సమస్యలు నివారించడానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మొదటి దశలో 13. 0. 45 + బోరాన్ ఒక గ్రాము + మోనోక్రోటోఫాస్ 1. 6 ఎం . ల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలసిందిగా సూచించారు . అలాగే పూమొగ్గ దశ నుండి నిమ్మకాయ దశ వరకు చేపట్టవలసిన సస్యరక్షణ గురించి ఈ క్రింది ప్రట్టికలో క్లుప్తంగ తెలియచేశారు . రైతులు తప్పకుండ సూచించబడిన మందులను క్రమ పద్దతిలో వాడుకొని నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేయవలసిందిగా కోరారు ఇతర సలహాలు సూచనలకు దగ్గరలో వున్న రైతుభరోస లను లేదా ఉద్యాన అధికారులను సంప్రదించాలన్నారు. కోరడమైనది రైతులకి ఇలాంటి పథకాలు, మారెన్నో రకాలు సౌకార్యాలను ఉద్యాన శాక అందిస్తోంది అని వాటినీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఉద్యాన అధికారి ఆనంద్ రెడ్డి, ఆర్బికె సిబ్బండి నరసింహ, హేమంత్, రైతు సంఘం కార్యకర్తలు కిషోర్, రైతులు పాల్గొన్నారు
పోటో:- మాట్లాడుతున్న దృశ్యం