పార్వతీపురం : ఉద్యోగిగా గర్వించాలని, అంకిత భావంతో విధులు నిర్వర్తించి
సమాజానికి మేలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వందల, వేల
సంవత్సరాల చరిత్ర కలిగిన ఉద్యోగంలో, మనం తాత్కాలికంగా కొంత కాలం మాత్రమే
ఉంటామని, ఆ కాలంలో చిత్తశుద్దితో పనిచేసి మన పేరును చిర స్థాయిగా ఉండేటట్లు
కృషి చేయాలని ఆయన సూచించారు. జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జిల్లా
కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా
కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్
పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాన్ని ఒక క్రమ
పద్ధతిలో నడిపించుట సివిల్ సర్వీసెస్ (పౌర సేవల ఉద్యోగులు) అవసరం అన్నారు.
సివిల్ సర్వీసెస్ కు వందలు, వేల సంవత్సరాల చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో అభివృద్ది, సంక్షేమం, పౌర రక్షణకు పౌర సేవల ఉద్యోగులు అవసరం ఉందని
అన్నారు. సమాజంలో శాంతి భద్రతలు ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా
చూడాలని ఆయన చెప్పారు. పౌర సేవల ఉద్యోగులు సమాజానికి ఒక నిర్మాణాత్మక పరికరం
అని సర్దార్ వల్లభాయ్ పటేల్ భావించారని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఏర్పడుతున్న
అనేక అస్తవ్యస్త పరిస్థితులను ముఖ్యంగా దేశ విభజన సమయంలో పౌర ఉద్యోగుల సేవలు
కీలకంగా పనిచేశాయని అన్నారు. విభిన్న పరిస్తితులలో పనిచేస్తూ సమాజం ఒక
స్థాయికి రావడంలో పౌర ఉద్యోగుల సేవలు ఉపయోగపడ్డాయని అన్నారు. అభివృద్ది,
సంక్షేమం, పౌర రక్షణలో మంచి స్థాయికి తీసుకు వెళ్ళడం జరిగిందని ఆయన
పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో దాదాపు అన్ని గ్రామ సచివాలయాలకు
భవనాలు సమకూర్చడం జరిగిందని, అసంక్రమిత వ్యాధుల సర్వేలో రాష్ట్రంలో నాలుగవ
స్థానంలో నిలిచామని దీనికి క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలు, వారి సామర్థ్యం
అమోఘమని అన్నారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయి సిబ్బంది వినియోగిస్తున్న యాప్ లు
వారి సామర్థ్యంకు నిదర్శనమని చెప్పారు.పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ అనేక
సందర్భాల్లో కీలకంగా వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వం నుండి జీతం
తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ పౌర సేవల ఉద్యోగి అన్నారు. మనం చేస్తున్న పనుల పట్ల
మనంతట మనం ప్రశ్నించు కోవాలని, చేసిన పని న్యాయమా? కాదా అని పర్యవేక్షించు
కోవాలని అన్నారు. మనం చేసే పనిలో న్యాయం ఉంటే దేశం అభివృద్ది, ప్రగతి దిశగా
అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.
విష్ణు చరణ్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి తరువాత మన దేశ అభివృద్ధికి అనుగుణంగా
సివిల్ సర్వీసెస్ లో మార్పులు తీసుకు వచ్చారన్నారు. ప్రభుత్వ విధానాలు అమలులో
సివిల్ సర్వీసెస్ పాత్ర కీలకమని చెప్పారు. ప్రగతి నివేదికలు చూసినపుడు ఒక
సంఖ్యగా పరిగణిస్తామని, అయితే ఒక సంఖ్య ఒక సామాన్యుడి జీవితం అని గుర్తించాలని
ఆయన పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఆర్జీకి నాణ్యమైన
పరిష్కారం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మనల్ని గుర్తు పెట్టుకోవాలి అనే
దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు
జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని గూర్చి వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ
సేవలు అందించిన రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా పంచాయతీరాజ్
ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్. కృష్ణా జి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ
ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.
దేవుళ్ల నాయక్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ యు.సాయి కుమార్,
సాలూరు సి.ఐ ఎస్.ధనుంజయ, ఎస్.బి ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస రావు, జియ్యమ్మవలస
ఎస్. ఐ పి.అనీష్ లకు జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవ అవార్డులను జిల్లా
కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.