విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ ఆక్షన్ కమిటీ సమావేశం గురువారం
పూజిత కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇటీవల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంఆధ్వర్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన
రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడం అభ్యంతరకరమని, దీనివలన ఉద్యోగులు
మనోభావాలు దెబ్బ తిన్నాయని, ఉద్యోగుల సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర
తేల్చుకోవాలి తప్ప సదరు చర్య కేవలం పబ్లిసిస్టెంట్ పబ్లిసిటీ స్టంట్
మాత్రమేనని, అనాలోచిత ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీసే చర్యగా భావిస్తూ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుండి ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ జేఏసీ
తప్పు కుంటున్నదని తెలిపింది. ఇక నుండి మాకు ఏపీజిఏతో ఎటువంటి సంబంధం లేదని
ముక్తకంఠంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ 23 జిల్లాల అధ్యక్షులు సభ్యులు
పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగువేల మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా, వీఆర్వోలకు
సీనియర్ సహాయకులుగా, అలాగే అన్ని తరగతుల రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నలు
కల్పించింది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 66 మంది
తాసిల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతులు కల్పించింది. ఏపీ జి ఈ ఏ
చర్యల వలన ఉద్యోగులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున, ఉద్యోగులందరూ
అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి
సంబంధించిన వీఆర్ఏ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు అన్ని తరగతులు ఉద్యోగులు,
రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్, కన్వీనర్ ఎస్ వెంకటేశ్వరరావు,
వీఆర్ఏ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జి ధైర్యం, డైరెక్ట్ వీఆర్ఏ రాష్ట్ర అధ్యక్షులు
పి జోసెఫ్, రెవిన్యూ కంప్యూటర్ల సంఘం అధ్యక్షులు సూరిబాబు, గ్రామ రెవెన్యూ
అధికారుల సంఘం నాయకులు, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.