ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామి ప్రకారం బకాయిలు చెల్లించాలి
కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దికరణ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి
ఔట్ సోర్శింగు ఉద్యోగులకు జీతాలు పెంచాలి
ఉద్యోగుల ఆర్థిక అంశాలపై ప్రభుత్వo తక్షణమే స్పందించాలి
ఉద్యోగుల ప్రయోనాల కోసమే ఏపీ జేఏసీ అమరావతి
ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు
విజయవాడ : గత మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే తెలియజేయాలని ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను 7 నుండి 10శాతం, 12 నుండి 15 శాతానికి పెంచాలని, రెండు పాత (1.1.2023 & 1.7.2023 ) డిఏ లు వెంటనే ప్రకటించాలని కోరారు. సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలపై వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకపోతే, ఈ నెల 22వ తేదీ జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యయ,రిటైర్డు,కాంట్రాక్టు, ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతం కృషిచేస్తున్న ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి ఆద్వర్యంలో గత ఏడాది 92 రోజులుగా ఉద్యమం చేసిన సందర్భంలో వివిధ శాఖల ఉద్యోగులకు చెందిన 39 ఆర్దికేతర సమస్యలు పరిష్కరించబడ్డాయన్నారు. సుమారు 6000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెందిన బకాయిలు చెల్లింపులు చేసినప్పటికీ, ఇంకా మిగిలి ఉన్న వేల కోట్ల బకాయిలు చెల్లింపులలో ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు హామీ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. శుక్రవారం విజయవాడ రెవిన్యూభవన్ లో ఏపిజేఏసి అమరావతి అత్యవసర స్టేట్ సెక్రటేరియట్ సమావేశం చైర్మన్ బొప్పరాజు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ గత సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘంతో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపిన అంశాల ప్రకారం ఉద్యోగులకు సుమారు 20 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని, మార్చి నెలాఖరు నాటికి జీ పీ యాఫ్ /సరెండర్ లీవులు / మెడికల్ రీయంబర్స్మెంట్ తదితర సుమారు రూ. 5000 కోట్లు వరకు చెల్లిస్తామని చెప్పారు. ఐఆర్ చెల్లించాల్సిందేనని పట్టుబట్టగా ముఖ్యమంత్రితో చర్చించి వెంటనే తెలియజేస్తామన్నారు. రిటైర్డు ఉద్యోగులకు గత 11వ పీఆర్సీ చర్చలలో అప్పటివరకు 70ఏళ్లకు 10శాతం , 75 ఏళ్లకు 15శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్సన్ ను తగ్గించి 7శాతం , 12.5శాతం ఉన్నవాటిని తిరిగి గతంలో మాదిరి 70ఏళ్లకు- 10% మరియు 75 ఏళ్లకు – 15శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్సన్ ను పునరుద్ధరించే అంశంపై చర్చించి తెలుపుతామని, 1.9.2004 ముందు ఉద్యోగాల్లో నియామకాలు పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57ఆక్ట్ ప్రకారం పాత పింఛను విధానం వర్తింప జేయడం విషయంలో చర్చించుకుని చెప్తామని తెలిపారు. గురుకులాలు, సొసైటీలు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు 62 సంవత్సరాల వయోపరిమితి పెంచడం పై నిర్ణయాన్ని తెలుపలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దికరణ ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని కోరాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగు ఉన్న మూడు డిఏ లు ప్రకటన విషయం స్పష్టత ఇవ్వాలని కోరాం. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వైధ్యులు, వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కారాని తక్షణమే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరాము. ఔట్ సోర్శింగు ఉద్యోగులకు జీతాలు పెంచాలనీ, అర్ధికేతర అంశాలపై వెంటనే ఆర్థికశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలనీ కోరామన్నారు. కావున మంత్రివర్గ ఉపసంఘం వారు చర్చించి చెబుతామని తేదీ 12.2.2024న హామీ ఇచ్చిన అంశాలపై తక్షణమే చర్చించుకుని, వెంటనే ఉద్యోగ సంఘాలకు స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఈనెల 22 న (గురువారం) విజయవాడలో ఏపి జేఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఈ సమావేశంలో ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టివి ఫణి పేర్రాజు , కోశాధికారి వి.వి.మురళి కృష్టనాయుడు తెలిపారు. ఈసమావేశంలో ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర నాయకులు డా.డి.జయధీర్, యస్. మల్లేశ్వరరావు, వి.అర్లయ్య, బి.కిశోర్ కుమార్, జి.జ్యోతి, డి.జే. ప్రసాద్, కె.రమేష్ కుమార్, డా. టి.జయప్రకాష్, వి.పాపా రావు, మహిళా విభాగం చైర్ పర్సన్ పారేలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి, రెవిన్యూఅసోషియేషన్ యన్టీఆర్ జిల్లా నాయకులు డి.శ్రీనివాస్, బత్తిన రామకృష్ట పాల్గొన్నారు.