వెలగపూడి సచివాలయం : నిరంతర శిక్షణ, అభ్యాసము వృత్తి నైపుణ్యాన్ని ఇనుమడింప
చేస్తుందని డా. రజత్ భార్గవ అన్నారు. మద్యనిషేద, అబ్కారి శాఖ నందు కారుణ్య
నియామకం ద్వారా ఉద్యోగము పొంది, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేయుచున్న వారికి
పునరుస్చరణ తరగతులను మద్యనిషేద అబ్కారి శాఖ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. రజత్ భార్గవ సచివాలయము లోని 4 వ బ్లాక్
సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఉద్యోగులు వారి నైపుణ్యాలను మెరుగుపరచుకొని,
మరింత సమర్దవంతంగా ప్రజలకు సేవలు అందించగలరని, వివిధ చట్టాలు, నిబంధనలు పట్ల
పూర్తి అవగాహన కల్గిఉన్న ఉద్యోగి త్వరితంగా ప్రజల మన్ననలు పొందగలరని డా. రజత్
భార్గవ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు, స్పందన వంటి
కార్యక్రమాలు సత్పలితాలు ఇవ్వాలంటే ఉద్యోగులందరూ ఆయా కార్యక్రమాలు, చట్టాలు,
నిబందన పట్ల పూర్తి పరిజ్ఞానం కల్గిఉండాలని, ఈ కార్యాలయం, కంప్యూటర్ వినియోగం,
సక్రమంగా చేసుకుంటే కార్యాలయపు పనులు వేగంగా, కచ్చితత్వంతో చేయగలరని తెల్పారు.
పది రోజులపాటు జరిగే ఈ శిక్షణ మొదటి బ్యాచ్ లో ఇరవై మంది ఉద్యోగులు
పాల్గొన్నారు. ఈ శిక్షణ ప్రారంభ సమావేశానికి డా. రజత్ భార్గవ తోపాటు అదనపు
మద్యనిషేద , అబ్కారి శాఖ అదనపు కమీషనర్ డి. దేవ కుమార్, జాయింట్ కమీషనర్
వి.అనసూయాదేవి, జాయింట్ సెక్రటరీ ఎస్. వెంకటేశ్వర్లు, అసిస్టంట్ కోర్స్
డైరెక్టర్ ఎ.వి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.