రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలి
సీఎం జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
అమరావతి : తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం కలిశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం
చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం
తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ,
ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ఏర్పాటు సహా రాష్ట్ర
కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం
చేశాయి.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జరగాల్సిన
మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములు.
ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది. మీ మనసులో
కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం అని సీఎం పేర్కొన్నారు. అందుకే పెన్షన్
సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపనపడ్డాం. గతంలో ఎవ్వరూ కూడా ఈ
సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడ్డ సందర్భాలు లేవు. ఉద్యోగులకు
పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దష్టిలో ఉంచుకోవాలి. దీన్ని
దృష్టిలో ఉంచుకుని జీపీఎస్ ను తీసుకువచ్చాం. రిటైర్డ్ ఉద్యోగుల జీవన
ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. 62 ఏళ్లకు రిటైర్
అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. అందుకే
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామని
సీఎం జగన్ చెప్పారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ
ఉద్యోగులకు సీఎం అండగా ఉంటానని స్పష్టం చేశారని తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం: బండి శ్రీనివాసరావు
12వ పీఆర్సీ ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఉద్యోగులకు కావాల్సిన
రాయితీలను ప్రకటించారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగస్వామ్యమేనన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం. చాలావరకు ఉద్యోగుల
సమస్యలను పరిష్కరించారు’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. 16 శాతం హెచ్ఆర్ఏ
ప్రకటించినందుకు ధన్యవాదాలు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను
స్వాగతిస్తున్నానని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతం : ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి
ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ వేసినందుకు
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ హయాంలో పీఆర్సీ కమిషన్ అడిగినందుకు
గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం
జగన్‌కు ధన్యవాదాలు. ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్
నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్
ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం
జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవని శివారెడ్డి అన్నారు.