విజయవాడ : ఏపిజెఏసి అమరావతి అత్యవసర రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఉద్యమాన్ని
కొనసాగించాలని ఏక్రీవంగా తీర్మానించింది. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మిక,
విశ్రాంత, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు
ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు ఇప్పటికే ఉద్యమ
కార్యచరణ ప్రకటించిన నేపథ్యంలో 7న ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం
ఆద్వర్యంలో జరిపిన చర్చలలో ఏపిజెఏసి అమరావతి పక్షాన కూడా రాష్ట్రకమిటి
పాల్గొంది. ఉద్యోగుల అనేక ఆర్ధిక, ఆర్దికేతర అంశాలు మంత్రివర్గ ఉపసంఘం
దృష్టికి తీనుకొని వెళ్లగా, కేవలం గత రెండు సంవత్సరాలుగా చెల్లింపులు
చేయకుండా ఉన్న మేము దాచుకున్న డబ్బులు షుమారు 3000 కోట్ల రూపాయలు ఈ నెలాఖరు
లోగా చెల్లింపులు చేస్తామని అలాగే మాకు చట్టబద్దంగా రావాల్సిన షుమారు 2000
కోట్ల రూపాయలు వచ్చే సెప్టెంబర్ నెల లోపు రెండు విడతలుగా చెల్లిస్తామని
చెప్పడం మినహా ప్రయోజనం లేదని పేర్కొంది. గురువారం విజయవాడ రెవిన్యూభవన్ లో
ప్రభుత్వం ఇచ్చిన మినిట్సు పై 26 జిల్లా జెఏసి చైర్మన్,ప్రధాన కార్యదర్శులు
జేఏసి రాష్ట్రకమిటితోపాటు ఏపిజెఏసి అమరావతి అనుబంద సంఘాల అధ్యక్ష,ప్రధాన
కార్యదర్శులతో సమావేశం జరిగింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు ఎంత
వరకు ఆచరణలోకి వస్తుందో చూడాల్సిఉందన్న బావన ఉద్యోగుల గట్టిగా ఉందని అన్నీ
జిల్లాల చైర్మన్ లు తెలిపారు. అలాగే మినిట్స్ లో తెలిపిన ప్రకారం, ఈనెల 16 న
మళ్లి చీప్ సెక్రటరీ వద్ద జరుగబోతున్న ఈ హెచ్ ఎస్ పిఆర్ సీ అరియర్సుపై
జరుగుతున్న సమావేశం ఉంది. దీనిపై కూడా ఏమి స్పష్టత ఇస్తారో వేచిచూస్తామని
వారన్నారు.
ప్రభుత్వం నుండి కొన్ని ఆర్ధిక పరమైన అంశాలు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని
కూడా దృష్టిలో పెట్టుకొని, గతంలో సిఎస్ కి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ లో చిన్న
చిన్న మార్పులు చేర్పులకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ ఉద్యమాన్ని వివిధ నిరసనల రూపంలో 9నుండి ఏఫ్రిల్ 5 వరకు నల్లబ్యాడ్జీలతో
నిరసన కొనసాగించాలని నిర్ణయించామని, ఈ మధ్యకాలంలో కొన్ని నిరసన కార్యక్రమాలు
జరపాలని తీర్మానించామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోషియేట్ చైర్మన్
టి.వి.ఫణి పేర్రాజు, కోశాధికారి వి.వి.మురళి కృష్టంనాయుడు, ఆర్గనైజింగు
కార్యదర్శి యస్.కృష్టమోహన్, పబ్లిసిటీ సెక్రెటరీ బి.కిషోర్ కుమార్ సమావేశం
అనంతరం మీడియాకు వెల్లడించారు.
సవరించిన ఉద్యమకార్యచరణ షెడ్యూల్ : 9 నుండి ఏఫ్రిల్ 5 వరకు నల్లబ్యాడ్జీలు
ధరించే ఉద్యోగులు విదులకు హాజరౌతారు.17న , 20 వ తేదీలలో అన్ని ప్రభుత్వ
కార్యాలయాలలో తిరుగుతూ ఉద్యమానికీ మద్దతు కోరుతూ అందరూ ఉద్యోగులతో చేయి చేయి
కలిపే కార్యక్రమం చేపడతారు. 21 నుండి వర్కుటూ రూల్ కార్యక్రమాన్ని ఏఫ్రిల్ 5
వరకు కొనసాగిస్తాం. 27 న అన్ని ప్రాంతాలలో కారుణ్యనియామాకాలు ద్వారా
ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబ సబ్యులను కలసే కార్యక్రమం చేస్తాం.