వెలగపూడి : అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణ కోసం,
అద్దె వాహనాలకు, కోర్టు కంటెంప్ట్ కేసులు, ప్రోటోకాల్ కొరకు సరిపడా నిధులు
కేటాయించాలి. కొంతమంది ఉన్నతాధికారుల అవగాహనా లోపంతో ముందస్తు ఆర్ధిక శాఖ
అనుమతి తీసుకోకపోవడంతో వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్
కార్పురేషన్ క్రిందకు చేర్చ లేదు. ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ క్రింద
కొన్ని శాఖల్లో ఆర్టీసి తో పాటు మిగిలిపోయిన విభాగాలలో ఉన్న ఔట్ సోర్సింగ్
ఉద్యోగులు అందరినీ అప్కోస్ క్రిందకు తీసుకొని వస్తేనే ఔట్ సోర్సింగు
ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఆప్కాస్ లో లేని ఔట్ సోర్శింగు ఉద్యోగులకు
జీతాలు సకాలంలో అందడం లేదు. ఈపియఎఫ్ & ఈయస్ఐ బెనిఫిట్స్ ఇవ్వడంలేదు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో తేదిః 02-06-2014 నాటికి 5
సంత్సరాల సర్వీస్ అన్న నిబంధన తొలగించి ఆ తేది నాటికి పనిచేస్తున్న
కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించాలి. మహిళా సంరక్షణ
కార్యదర్శులుగానే కొనసాగాలనుకునే వారిని మహిళా పోలీసు గా కాకుండా మహిళా
సంరక్షణ కార్యదర్శులుగానే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. డి ఎ, పిఆర్సీ
అరియర్స్ పెన్షనర్లకు వెంటనే ముందు చెల్లించాలి. గురు కులాలు, యూనివర్సిటీ,
పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాల వయో పరిమితిని వెంటనే పెంచాలి.
చెన్నై, బెంగుళూర్, వేల్లూరు లోని ఆసుపత్రులలో ఈ హెచ్ యస్ క్రింద రాష్ట్రంలోని
ఉద్యోగులందరు వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. ఏపిపిటిడి (ఆర్టీసి)
ఉద్యోగులకు ఓటి & నైట్ ఔట్ అలవెన్సులు తో పాటు విలీనం కు ముందు ఆర్టీసి
ఉద్యోగులకు చెల్లిస్తున్న అన్ని అలవెన్సులు ప్రతినెలా జీతంతో పాటు చెల్లించేలా
చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఉద్యోగాలలో చేరిన ప్రతి జూనియర్ అసిస్టెంట్ స్థాయి
ఉద్యోగికి కనీస శిక్షణ విధిగా ఇవ్వాలి. ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి
ఆద్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరంకోసం చేపట్టిన ఉద్యమం ఫలితంగా
ముఖ్యమంత్రితో జరిగిన చర్చలు సందర్బంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
త్వరితగతిన పరిష్కారం జరగాలంటే ప్రతినెలా అన్ని డిపార్టు శాఖాధిపతుల
స్దాయిలోను,జిల్లా స్దాయిలోను గ్రీవెన్సు డే లు నిర్వహించేలా చూడాలని ఏపిజేఏసి
అమరావతి రాష్ట్రకమిటిగా చేసిన విజ్ఞప్తి మేరకు అదే రోజు తగు ఆదేశాలు ఇవ్వడం,
అలాగే అన్నీ డిపార్టు మెంట్లు వారి వారి శాఖాపరమైన సంఘాల నాయకులు తో ఇప్పటికే
చర్చలు జరిగాయని, చివరిగా అందులో బాగంగానే రాష్ట్ర స్దాయిలో పరిష్కారం
కావల్సిన అంశాలపై కూడా అత్యున్నత రాష్ట్ర స్దాయి జాయింటు స్టాఫ్ కౌన్సిల్
సమావేశం కూడా ఉద్యోగసంఘాలతో ఈ రోజు గురువారం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి
ధన్యవాదాలు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన తెలిపారు.
ఉద్యోగుల సమస్యలు పట్ల గతంలో హామి ఇచ్చి ఇంకా పరిష్కారం కాని అంశాలపైన,
కేబినెట్ లో ఆమోదించిన అంశాలపైన నేటి సమావేశంలో ప్రధానంగా ఉన్నతాధికారులు
చర్చించారు. ఈ సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని
అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలలో రోజువారీ కార్యక్రమాలు నిర్వాహనకోసం, అద్దె
వాహనాలకు, కోర్టు కంటెంప్ట్ కేసులు, ప్రోటోకాల్ లాంటి అనేక పద్దుల క్రింద
సరిపడా నిధులు సకాలంలో కేటాయించాలని కోరారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను
2014 జూన్ 2 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయినవారికే క్రమబద్ధికరణ చేస్తామని
నిభందనలు పెట్టడంవలన కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది.
కావున ఆతేది నాటికి పనిచేస్తున్న అందరికీ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా
క్రమబద్దికరణ చేయమని కోరుతు లేఖ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో అత్యదిక
సంఖ్యలో సుమారు 2 లక్షలు పైబడి ఉన్న ఔట్ సోర్శీంగు ఉద్యోగులకు (చిరుద్యోగులు)
ఆర్టీసి, పంచాయతీ రాజ్ , రెవెన్యూ తదితర శాఖలలో పనిచేసే ఔట్ సోర్శింగు
ఉద్యోగుల తో సహా అందరికీ జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి చేసేందుకు ప్రభుత్వం
ఔట్ సోర్శింగు ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ఆప్క్సకాస్ సంస్దలోకి
అందరిని చేర్చి వారికి న్యాయబద్దంగా ఇవ్వాల్సి ఇపియఫ్ & ఈయస్ఐ సౌకర్యాలు
కల్పించడం తోపాటు ప్రతినెలా చట్టప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన జీతాలు వారికి
పడేలా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కూడా ఈ సమావేశంలో సియస్ కి లేఖ ఇచ్చామని
వారు తెలిపారు. అంతే కాకుండా గ్రామ సచివాలయ వ్యవస్దలో పనిచేస్తున్న మహిళా
సంవరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా చూపించకుండా, కోరుకున్న
వారికిమాత్రమే మహిళా పోలీసులుగా తీసుకొని మిగిలినవారిని మహిళా కార్యదర్శులు గా
వారి విధులు వారు నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని కోరగా దీనిపై సానుకూలంగా
స్పందించారు. అలాగే ఏపిపిటిడి(ఆర్టీసీ)ఉద్యోగులకు చెల్లించాల్సిన ఓవర్
టైమ్(ఓటి), నైట్ హాల్టు లాంటి విలీనంకు ముందున్న అన్ని అలవెన్సులు కూడా అన్ని
ప్రతినెలా జీతంతో చెల్లించేలా చూడాలని కోరగా దీనిపై కూడా సానుకులంగా
స్పందించారు. అదేవిధంగా గత మంత్రి వర్గ ఉపసంఘం సందర్భంగా ఉద్యోగులకు,
పెన్షనర్లకు 1.7.2019 & 1.7.2021 రెండు డి ఏలు, పీఆర్సీ అరియర్స్ ను నాలుగు
సంవత్సరాలుగా చెల్లిస్తామని ఒప్పందం కుదిరినప్పటికీ, పెన్షనర్ల ఆవేదనను
దృష్టిలో ఉంచుకుని, పెన్షనర్లకు చెల్లించాల్సిన డి ఎ మరియు పిఆర్సీ అరియర్స్
వెంటనే మాకన్నా ముందుగానే చెల్లించాలని లిఖిత పూర్వకంగా ప్రభుత్వాన్ని కోరామని
తెలిపారు. అలాగే, గురుకులాలు, యూనివర్సిటీ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు కూడా
62 సంవత్సరాల వయో పరిమితిని వెంటనే పెంచాలని కోరామన్నారు. ఇప్పటివరకు చెన్నై,
బెంగుళూర్, వెలూరు లోని ఆసుపత్రులలో ఈ హెచ్ యస్ క్రింద వైద్యం చేయించుకునే
వెసులుబాటు కేవలం నెల్లూరు, చిత్తూరు, అనంతపురము జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు
మాత్రమే ఉన్నందున, సదరు వెసులుబాటును రాష్ట్రంలోని ఉద్యోగులందరు చెన్నై,
బెంగుళూర్, వెలూరు లోని ప్రధాన ఆసుపత్రులలో వైద్యం చేయించుకునే వెసులుబాటు
కల్పించాలని లిఖిత పూర్వకంగా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కోరినట్లు తెలిపారు.
కొత్తగా ఉద్యోగాలలో చేరిన ప్రతి జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి కనీస
శిక్షణ లేనందున విధి నిర్వహణలో సరిగా పని చేయలేక పోతున్నందున, ప్రతి కొత్తగా
సర్వీస్ లో చేరే జే ఏ స్థాయి ఉద్యోగికి శిక్షణ విధిగా ప్రభుత్వం ఇవ్వాలని
కోరారు. ఈ సమావేశంలో ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు,స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోసియేట్ చైర్మన్
టి.వి. ఫణి పేర్రాజు, రాష్ట్రకోశాధికారి వి.వి.మురళికృష్ట నాయుడు
పాల్గొన్నారు.
చర్చల అనంతరం గురువారం సచివాలయంలో పై విషయాలు అన్నీ మిడియాకు వివరించారు.