ఆ శాఖ కమిషనర్ ని కలిసిన ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల
సంక్షేమ సంస్థ రాష్ట్ర కమిటీ
విజయవాడ : ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర కమిటీ
రెవెన్యూ భవన్ నందు చర్చించుకుని, గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ , విలేజ్
సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ కమిషనర్ ని కలిసి గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల పై వినతిపత్రం
సమర్పించారు. ప్రొబేషన్ డిక్లరేషన్ : రెండో విడత గ్రామ, వార్డు సచివాలయం
నోటిఫికేషన్ ద్వారా విధుల్లోకి వచ్చినటువంటి దాదాపు 16 వేల మందికి పైగా
ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియని తక్షణమే ప్రారంభించి వెంటనే
వారికి పే స్కేల్ వర్తింప చేయాలని కోరారు. బదిలీలు: అలాగే ప్రతిరోజూ వందల
కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తూ నాన్ లోకల్ జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్న
వారికోసం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, భర్త, భార్య వేరు వేరు
జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్న వారు తదితరులకు ట్రాన్స్ఫర్ (బదిలీలు) వెంటనే
కల్పించాలని కోరారు. గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులపై పని ఒత్తిడి
తగ్గించేందుకు యోగా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ
మధ్య కాలంలో పని వత్తిడి తట్టుకోలేక చాలా మంది ఉద్యోగుల ఆత్మహత్య
చేసుకుంటున్నారు. ఉద్యోగులకు మానసిక వత్తిడి ని తగ్గించే యోగా, క్రీడలు,
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరారు. డిజిటల్
అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ కోసం గ్రామ/వార్డ్
సచివాలయంలో ప్రత్యేక గదిని కేటాయించమని కోరారు.
ప్రతి రోజు గ్రామ వార్డ్ సచివాలయాల సర్వీస్ ల రూపంలో వసూలు అవుతున్న క్యాష్
చెస్ట్ , ఆధార్ క్యాంప్ లకు సంబంధించిన సామాగ్రిని బద్రపరచడానికి మరియు ఇతర
విలువైన సామాగ్రిని డాక్యుమెంట్స్ నీ భద్రపరచడం కోసం కొత్తగా గ్రామాల్లో మరియు
వార్డులలో నిర్మిస్తున్న సచివాలయంలలో ప్రత్యేకంగా డిజిటల్ అసిస్టెంట్/వార్డు
ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ కోసం ఒక గదిని కేటాయించమని కోరారు.
డిజిటల్ అసిస్టెంట్/వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి ఇతర
పనులు అప్పగించవద్దని కోరారు. గ్రామ/వార్డ్ సచివాలయం లో పనిచేసే డిజిటల్
అసిస్టెంట్ / వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి వేరొక
డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పనులను కేటాయించడం వలన ఆఫీస్ ఆవరణలో
చేసేటటువంటి పౌర సేవలకు అంతరాయం కలుగుతుందని కావున ఆ విషయంలో కూడా ఒకసారి
పునరాలోచించి, వారికి వారి డిపార్ట్మెంట్ పనులను మాత్రమే కేటాయించాలని కోరారు.
ఈ సమస్యలపై స్పందించిన ఉన్నతాధికారులు, తప్పకుండా మా న్యాయమైన సమస్యలను
ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రేటరి జెనరల్ వై వి రావు, ఆంధ్రప్రదేశ్
గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులు సంక్షేమ సంస్థరాష్ట్ర అధ్యక్షులు వి.
అర్లయ్య , ఎస్. గోవింద రావు, ఉపాధ్యక్షులు జి .జ్యోతి, కె. సుధీర్ ,
కోశాధికారి బి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.