విజయవాడ : ప్రజల్లో భాగమైన ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ
కార్యక్రమాలను, లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారదులుగా ఉన్న ప్రభుత్వ
ఉద్యోగులు అంటే గతంలో చాలా గౌరవం ఉండేదని అప్పుడు నాయకత్వం వహించే వారికి
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఉండేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల
సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు అన్నారు. ఆ విధంగా
ఉన్న ఉద్యోగ వ్యవస్థకి గత పిఆర్సిలో నాయకులు ఆడిన ఆధిపత్య పు ఆటలో సాధారణ
ఉద్యోగి నలిగిపోయాడని, ఉద్యోగులంటే ప్రజల్లో ఉన్న గౌరవభావం పోగొట్టారని, దాని
ఫలితం నేడు ఉద్యోగ వ్యవస్థ అంటే చులకన భావానికి కారణం ఈ నాయకత్వాలేనని
పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావలసిన రాయితీలు ఇప్పించలేక
చతికిలబడ్డారని, గతంలో పిఆర్సి కమిటీ రిపోర్టు లేకుండా ప్రభుత్వంతో చర్చలకు
వెళ్లి చారిత్రాత్మక తప్పిదం చేసి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగులను
ప్రభుత్వానికి చులకన చేశారని అన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు భిన్నంగా
వ్యవహరించిన నాయకులు మరోసారి వారి వారి నాయకత్వం నిలుపుకోవడానికి పడరాని
పాట్లు, ఫీట్లు చేస్తూ ఉద్యోగులను మరోసారి మోసగించడానికి ప్రయత్నం
చేస్తున్నారని, అయితే ఉద్యోగులు ఇప్పటికే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో
నిర్ణయాలు తీసుకొని స్థిరంగా ఉన్నారని చెప్పారు. తగిన సమయం కోసం ఎదురు
చూస్తున్నారని, అయితే ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలలో ఒక్క దానిని కూడా
ఇప్పించలేని సంఘ నాయకులకు ఓడి లెందుకని, వీరి నాయకత్వాలు సాధారణ ఉద్యోగికి
అవసరం లేదని, ఆ ఓడి సౌకర్యాలను ప్రభుత్వం ఉపసంహరించుకుని నాయకులు వారి వారి
విధులకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు డిమాండ్
చేశారు.