వెలగపూడి : రాష్ట్ర సచివాలయంలోని ఒకటవ బ్లాక్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి గా భాద్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి ని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన
నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్
బొప్పరాజు చీఫ్ సెక్రటరీ కి అభినందనలు తెలిపిన తరువాత, ఉద్యోగులకు రావాల్సిన
ఆర్థిక పరమైన పీ ఆర్ సి ఏరియర్స్, డి ఏ ఎరియర్స్, పెండింగ్ డి ఏ ల విడుదల,
సరండర్ లీవ్ బకాయిలు, జీ పీ ఎఫ్ లోన్స్, తదితర అంశాలతో పాటు నాన్ ఫైనాన్షియల్
ఇష్యూ లను వారి దృష్టికి తీసుకు వచ్చారు. చీఫ్ సెక్రటరీ సానుకూలంగా స్పందిస్తూ
త్వరలో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగుల
సమస్యలను ఎప్పుడైనా తన దృష్టికి తీసుకు రావచ్చని తెలిపారు. చీఫ్ సెక్రటరీ ని
కలిసిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్,
ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ క్లాస్-4 ఎంప్లాయీస్ అసోసియేషన్,
ఏపీ పీ ఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్, ఏపీ వీ ఆర్ ఓస్ అసోసియేషన్, , ఏపీ గ్రామ
వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ, ఏపీ పీటీడీ కార్మిక పరిషత్ తదితర
సంఘాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని శాలువాతో
చిరు సత్కారం చేశారు.