ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం చేస్తున్న పోరాటం
80 రోజులుగా చేస్తున్న మా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ పరిణామాలకు
ప్రభుత్వమే బాద్యత వహించాలి
ఏపీ జెఎసి అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమస్యలపై ఏపీ జెఎసి అమరావతి గత 80 రోజులుగా
చేపట్టిన ఉద్యమం ఫలితంగానే ప్రభుత్వం కొన్ని ఆర్ధిక, ఇతర సమస్యలకు ఒక్కొక్క దశ
ఉద్యమంలో ఒక్కొక్క సమస్యకు పరిష్కారం చూపుతూ ఉత్తర్వుల రూపంలో ఉద్యమ కాలంలో
విడుదల చేసిందని, కేవలం ఉద్యమం ఫలితంగానే ఆ సమస్యలు పరిష్కారానికి
నోచుకున్నాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన
కార్యదర్శి పలిశెట్టి దామోదర్ రావు లు పేర్కొన్నారు. శనివారం ఏలూరులో టొభాకో
మర్చెంట్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి పిలుపు
మేరకు జరిగిన మూడవ ప్రాంతీయ సదస్సు ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్
అధ్యక్షతన జరిగింది.
ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 80
రోజులుగా సమస్యలపై ఉద్యోగులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ తెలీదన్నట్టు,
ఉద్యమం పట్ల చిన్న చూపు చూస్తూ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ
ఉంది. ఉద్యమం పై స్పందించకుండా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంటే ఉద్యమం
అంత కసితో ఉవ్వేత్తున పైకి లేస్తుందే తప్ప, ఉద్యమం లో వెనుకడుగు వేసేది
ఉండదని తెలిపారు. ఈ ఉద్యమం ఎవరో వెనుక ఉండి చేపిస్తున్న ఉద్యమం కాదు. నాయకులు
చేస్తున్న ఉద్యమం అంతకంటే కాదు. ఇది కేవలం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం అని
ప్రభుత్వం గమనించాలి. మా ఉద్యమాన్ని చల్లపరిచేందుకు ఉద్యోగులకు సంబంధించి మా
మొదటి దశ ఉద్యమ సందర్భంగా జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ డబ్బులు, రిటైర్డ్ ఉద్యోగులకు
బెనిఫిట్స్, కొత్త జిల్లాలకు 16% హెచ్ఆర్ఏ,ఆర్టీసి ఉద్యోగుల ఓటి డబ్బులు
తదితరు జీవోలు ఇచ్చింది. ఈ జీవోలకు వెలువడడానికి కారణం ఏపీజేఏసీ అమరావతి
పోరాటమేనన్న సంగతి ఉద్యగులందరికీ తెలిసిందే. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా
నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని
తెలుపుతూ ఉద్యోగులు మరో చలో విజయవాడ పిలుపునివ్వకముందే సమస్యలు పరిష్కరించాలని
ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సధస్సులో పాల్గొన్న మరో ముఖ్యఅతిధి ఉద్యోగుల ఏపిజెఏసి అమరావతి స్టేట్
సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు
సాధన కోసం నిజాయితీగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగులు లేని
ఉద్యోగ సంఘం నాయకులతో మా ఉద్యమం బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి
తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదు, తగ్గేధి లేదని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల
పరిష్కారంలో స్పష్టత వచ్చేంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదని దామోదరరావు
తెలిపారు. అలాగే ఈ సదస్సులో పాల్గొన్న ఏపిజెఏసి అమరావతి స్టేట్ అసోసియేట్
చైర్మన్ టి.వి.ఫణీ పేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు మాట్లాడుటూ
ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపేందుకు ఎన్ని ఆటంకాలు సృష్టించి, ఎంత నిలువరించినా
అంతకు అంత రెట్టింపు ఆక్రోషంతో, ఆవేదనతో ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి
ఏపీజేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్తారని
అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా సిద్దంగా ఉన్నరని వారు తెలిపారు.
ఉద్యోగుల న్యాయమైన ప్రధాన డిమాండ్స్ అయిన నాలుగు డిఏ ఆరియర్స్, పిఆర్సి
అరియర్స్, కొత్త పే స్కేల్ ,స్పెషల్ పే స్కేల్, 12వ పిఆర్సి కమిషనర్ నియామకం,
అలాగే సియస్ కి సమర్పించిన 50పేజీల మెమొరాండం లోని ప్రధాన అంశాలపై ఉత్తర్వులు
సాధించేవరకు పోరాటం నిలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏపిజెఏసి
అమరావతి సమస్యలు పరిష్కరించనీ పక్షంలో మూడవ దశలో ప్రాంతీయ సదస్సులు అనంతరం
భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఉద్యమంలో
జరిగే పరిణామాలు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బొప్పరాజు , పలిశెట్టి
దామోదరరావు స్పష్టం చేశారు.
ప్రాంతీయ సదస్సు సభ ప్రారంభానికి అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉద్యోగులు చేపట్టిన
భారీ ర్యాలీ నినాదాలతో ఏలూరు నగరం మారు మోగింది. ఏలూరు ప్రాంతీయ సదస్సు
విజయవంతంగా ముగియడంతో ఉద్యోగుల్లో మరింత రెట్టింపు ఉత్సాహం వచ్చింది.
భవిష్యత్లో ఏపీ జేఏసీ అమరావతి చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుంటామని
ఉద్యోగులు తెలిపారు. ఈ సదస్సు లో ఏపిజెఏసి అమరావతి అనుబందసంఘాల నాయకులు
రెవిన్యూ అసోషియేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి చేభ్రోలు కృష్ట మూర్తి,
మున్సిఫల్ ఎంప్లాయిస్ అసోషియేషన్ రెాష్ట్రఅధ్యక్షులు యస్.కృష్టమోహన్,స్టేట్
డ్రైవర్సు అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, గ్రామవార్డు
సచివాలయ ఉద్యోగుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.అర్లయ్య, ఏపి వర్కు
ఆర్ట్సు, పిఇటి ఇన్ట్రక్టర్సు అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుక్షురాలు
యస్.శివకుమార్ రెడ్డి, యస్.బి.టి.యస్ ఉపాద్యాయసంఘం అధ్యక్షురాలు
దేవి,కాంట్రాక్టు , ఔట్ సోర్శింగు సంఘం రాష్ట్రఅధ్యక్షులు కె.సుమన్,
రాష్ట్రఅధ్యక్షులు కె.ఆంజనేయకుమార్, ఏపి హెల్తు ఎడ్యుకేటర్ & మిడియా ఆఫీసర్సు
అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానుమూర్తి, ఏపిజెఏసి అమరావతి
రాష్ట్రనాయకులు జి.జ్యోతి, ఆర్.వి. రాజేష్, ఎ.సాంబశివరావు.యస్
.మల్లేశ్వరరావు, బి.కిషోర్ కుమార్ తో పాటు ఏలూరు జిల్లా ఏపిజెఏసి అమరావతి
జిల్లా ప్రధానకార్యదర్శి బి.రాంబాబు, పశ్చిమగోదావరిజిల్లా చైర్మన్
యస్.శివశంకర్, కృష్టాజిల్ల చైర్మన్ తోట వెంకటసతీష్ , కర్నులూ జిల్లా చైర్మన్
వి.గిరికుమార్ రెడ్డి తో పాటు ఏఐటియుసి రాష్ట్రనాయకులు కృష్టమాచార్యులు, బండి
వెంకటేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు బి.సోమయ్య మాట్లాడారు. ఈ సదస్సులో
ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్టా జిల్లాలకు చెందిన ఉద్యోగులు సుమారు రెండు
వేలమంది సదస్సులో పాల్గొన్నారు.