అమరావతి : తెలుగుదేశం పార్టీ ఇటీవల ‘జగనాసుర రక్త చరిత్ర’ అనే పుస్తకం విడుదల
చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకత్వంపై డిప్యూటీ స్పీకర్
కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ పుస్తకం
విడుదల చేసిందని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు
రాష్ట్రానికి చేసిందేమిటి? అని ప్రశ్నించారు. ప్రజలకు ఈ మేలు చేశాను. ప్రజలు
ఈ ప్రయోజనం కల్పించాను అని చెప్పుకుని ఓట్లు అడగ్గలవా అంటూ చంద్రబాబును
ప్రశ్నించారు. బాబు నాయకత్వాన్ని బలపరిచే నాయకులు టీడీపీలో ఒక్కరూ లేరని
వ్యాఖ్యానించారు. ఇలాంటి పుస్తకాలు తెచ్చినా, సినిమాలు తీసినా, బహిరంగ సభల్లో
చెప్పినా మీ మాటలు నమ్మేవారెవరూ లేరని కోలగట్ల స్పష్టం చేశారు. ఇప్పుడంతా
సోషల్ మీడియా ప్రభావం కనిపిస్తోందని, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ను ఫాలో
అవుతున్నారని వెల్లడించారు. ఇలాంటి వేళ మీరు పుస్తకం రిలీజ్ చేస్తే
చదివేవాళ్లు ఎవరైనా ఉంటారా అని టీడీపీ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.