విశాఖపట్నం : ఉన్నత చదువుల్లో మరింత రాణించి తల్లిదండ్రులకి మంచి గుర్తింపు
తేవాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం స్థాయిలో 10వ తరగతి పరీక్షలలో మొదటి మూడు
స్థానాలలో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు జగనన్న ఆణిముత్యం అనే
కార్యక్రమం ఆరిలోవలోని తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన
అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులచే జాతీయ గీతం
ఆలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యత
ఇస్తున్నారని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో పాటు
పాఠశాలల అభివృద్ధికి, పిల్లలలో మంచి సృజనాత్మకను తీసుకువచ్చేందుకు ఎన్నో మంచి
కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అమ్మ ఒడి, గోరుముద్ద, నాడు నేడు, లాంటి
వినూత్న కార్యక్రమాలు చేపట్టి పేద విద్యార్థులను ఉన్నత స్థాయికి
తీసుకువచ్చేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి ద్వారా పాఠశాలలో
చదివే ప్రతి తల్లి కి 15వేల రూపాయలు ఆమె అకౌంట్లో వేస్తున్నారని, జగనన్న
గోరుముద్దలో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నారని, నాడు
నేడు క్రింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
విద్యార్థులకు జిల్లాస్థాయిలో 10వ తరగతి పాసైన విద్యార్థి విద్యార్థులకు
జగనన్న ఆణిముత్యం అనే కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించి మొదటి బహుమతి రూ.
15000/-, 2వ బహుమతి రూ.10000/-, మూడు వ బహుమతి రూ. 5000/- ఇవే కాకుండా పాఠశాల
పరిధిలో మొదట బహుమతి రూ.3000/-, రెండువ బహుమతి రూ. 2000/-, మూడవ బహుమతి
రూ.1000 చొప్పున ఇవ్వడమే కాకుండా వారికి మెరిట్ సర్టిఫికేట్ తో పాటు
దుస్సాల్వతో సత్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు
బైజుస్ ట్యాబులను ఇచ్చి వారి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని
పేర్కొన్నారు. విద్యార్థులు 10 పాస్ అయిన తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు
జగనన్న ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, జగనన్న పేద విద్యార్థుల చదువు
కొరకు వారికి కార్పోరేట్ విద్య అందించేందుకు ప్రతి పేదవానికి కాలేజీ ఫీజులు
తానే చెల్లించి వారిని పైకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి
విద్యార్థి క్రమశిక్షణతో మంచి నడవడికతో విద్యాబోధన చేసి ఉద్యోగాలలోను
రాణించాలని తద్వారా తమ కుటుంబ పోషన కాకుండా దేశ ప్రగతికి ఎంతో
తోడ్పడినవారవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో 10వ తరగతి అలాగే ఇంటర్
విద్యార్థులకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ
ప్రోత్సాహకం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ,
ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయురాలు భవాని, పాఠశాల కమిటీ
చైర్మన్ జి ధనలక్ష్మి, కమిటీ సభ్యులు కే మోహన్ రావు, విద్యార్థులు వారి
తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.