హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన
ఆర్.లింబాద్రి సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ
సందర్భంగా అభినందనలు తెలిపిన మంత్రి… ఉన్నత విద్యలో రాష్ట్రాన్ని ఉన్నత
స్థానంలో నిలపాలని సూచించారు. ఇందుకు శాయశక్తులా కృషి చేస్తానని లింబాద్రి
హామీ ఇచ్చారు. విద్యామండలి ఉపాధ్యక్షుడిగా నియమితులైన షేక్ మహమూద్ కూడా
మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

చేతివృత్తులపై పరిశోధనలు చేయాలి : రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్
లింబాద్రి, కొత్త ఉపాధ్యక్షుడు మహమూద్‌లతో రం రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్
జూలూరు గౌరీశంకర్ సమావేశమయ్యారు. చేతివృత్తులపై విశ్వవిద్యాలయాల్లో
పరిశోధనలు, ఆయా వృత్తిదారులకు సాంకేతిక సాయం అందించడంపై చర్చించారు. ఉన్నత
విద్యామండలి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో చేతివృత్తులకు సంబంధించిన
వర్క్‌షాపులు నిర్వహించాలని గౌరీశంకర్ కోరారు.