అయితే ఈ రకమైన ఉపవాసం గురించి యుకె, మాంచెస్టర్లో, ఇంటర్నేషనల్ స్పోర్ట్,
ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ కాన్ఫరెన్స్లో ఒక పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో తేలిన
అంశాలు
పని సున్నా:
ఉపవాసం సమయంలో తగ్గే బరువు, కండరం, ఎముకల సాంద్రతలు తగ్గడంతో సమకూరుతుంది.
కొవ్వు కరగదు
• ఉపవాసం ఇన్సులిన్ సెన్సిటివిటీకి ప్రయోజనకరమైనది అని ఏ అధ్యయనంలో వెల్లడి
కాలేదు. నిజానికి ఉపవాసంతో ఐఎమ్ఐజి (ఇంట్రామస్క్యులర్ ట్రయాసిల్ గ్లిసరాల్
పెరగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. హాని ఎక్కువే!
• ఉపవాసంతో పొట్ట నుంచి ఆహారం ఖాళీ అయ్యే సమయం (గ్యాస్ట్రిక్ ఎంపీయింగ్)
నెమ్మదిస్తుంది.
• అసిడిటీ, తలనొప్పి, మలబద్ధకం, నెలసరి క్రమం తప్పడం లాంటి ఇబ్బందులు
వేధిస్తాయి.కెఫీన్ మీద ఆధారపడే పరిస్థితి పెరుగుతుంది.
• తర్వాతి రోజు ఉపవాసానికి సిద్ధ పడడం కోసం, శరీరం శక్తిని ఖర్చు
పెట్టనివ్వదు. ఆ క్రమంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది.
ఉపవాసం పై అపోహలు:
• వనరులు తక్కువగా ఉన్నప్పుడు సమర్థంగా పని చేయడం కోసం శరీరం ‘ఆటొపజీ’ అనే
మెకానిజంకు లోనవుతుంది. ప్రతికూల సమయాల్లో కూడా శరీరం ఇదే పని చేస్తుంది.
కాబట్టి ఇది శరీరానికి చేటు కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆ కీటోన్లతో అందే పరిమిత శక్తి తేలికపాటి వ్యాయామాలకే సరిపోతుంది. హై
పర్ఫార్మెన్స్తో కూడిన వ్యాయాయాలు చేయలేరు.