ఉమెన్స్ ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గుజరాత్ జెయింట్స్‌కు
మెంటార్, అడ్వైజర్‌గా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నియమితులయింది. ఈ
విషయంపై మిథాలీ ట్వీట్ చేస్తూ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళా క్రికెట్
అతిపెద్ద గేమ్ ఛేంజర్ అవుతుంది. ఈ అద్భుతమైన అవకాశానికి చాలా ధన్యవాదాలు,
ప్రణవ్ అదానీ.” అని పేర్కొంది. కాగా ఈ ఉమెన్స్ ఐపీఎల్ మొత్తం ఐదు జట్లతో 2023
సీజన్ మార్చిలో ప్రారంభం కానుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక
పరుగులు సాధించిన క్రీడాకారిణి మిథాలీ. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత అన్ని
ఫార్మాట్ల నుండి గత ఏడాది రిటైరైంది. జట్టుకు మెంటార్‌గా, 40 ఏళ్ల క్రికెటర్
మహిళల క్రికెట్‌ను కూడా ప్రోత్సహిస్తుంది. గుజరాత్లో అట్టడుగు స్థాయిలో
క్రీడను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ. 1289
కోట్లు వెచ్చించడంతో ఇటీవల వేలంలో ఐదు జట్లలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ అత్యంత
ఖరీదైనదిగా నిలిచిన విషయం తెలిసిందే.