పద్మశ్రీ ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు హాలులో
గురువారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నిక జరిగింది. ఎన్నికలో
మొత్తం 35 మంది జెడ్పిటిసి లు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా
ఘంటా పద్మశ్రీ పేరును ద్వారకా తిరుమల జెడ్పిటిసి చిగురుపల్లి శామ్యూల్
ప్రతిపాదించగా దెందులూరు జెడ్పిటిసి నిట్ఠా లీలా నవకాంతం బలపరిచారు. మిగిలిన
జెడ్పిటిసి లు ఆమోదించడంతో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఘంటా పద్మశ్రీ
ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు.
అనంతరం పుష్పాగుచ్చo అందించి అభినందించారు. ఘంటా పద్మశ్రీని రాష్ట్ర పౌర
సరఫరాల శాఖా మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర హోమ్ శాఖా
మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద రాజు, పార్లమెంట్ సభ్యులు
కోటగిరి శ్రీధర్, శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్,
శాసనసభ్యులు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, చెరుకువాడ శ్రీరంగనాధరాజు,
పుప్పాల వాసుబాబు, తలరి వెంకటరావు, డి సి సి బి చైర్మన్ పి .వి. ఎల్.
నరసింహరాజు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు
ఎస్.ఎం ఆర్. పెదబాబు, జెడ్పిటిసి లు, అధికారులు పుష్పగుచ్చాలు అందించి
అభినందించారు. ఈ సందర్భంగా ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు,
అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పధంలో నిలిపిఎందుకు కృషి చేస్తానన్నారు.