హాజరైన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ
చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి,
జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్,
ప్రావీణ్య, సిపి రంగనాథ్
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన
తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా
నిర్వహించారు. హనుమకొండ లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ
మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్,
ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర
జ్యోతి, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సిపి రంగనాథ్
తదితరులతో కలిసి అదాలత్ సెంటర్ లో అమరవీరుల స్థూపం కు నివాళులు అర్పించి,
తెలంగాణ గర్వించదగ్గ మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్,
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ
తరువాత హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లాల అమరవీరుల
కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య
అతిథిగా పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది
ఉత్సవాల్లో ఈ రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా
అమరులందరికి నా ఘన నివాళులు. తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో
ఏర్పడింది. అసువులు బాసిన వీరులను మనం మరచిపోలేం. ఇప్పటికీ ఉద్యమ రోజులు
గుర్తు వస్తె బాధ అన్పిస్తుంది. తాము నష్టపోయిన తరువాతి తరాలు తెలంగాణ
రాష్ట్రంలో బాగుపడాలి అని వీర మరణం పొందారు. వారికి మనం ఏమి చేసినా తక్కువే.
కానీ వారికి అన్ని విధాలా రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ఉద్యమ సారథి, నేటి సీఎం
కేసీఆర్ అండగా నిలబడ్డారు. అమరవీరులను, అమరవీరుల కుటుంబాలను సీఎం కెసిఆర్
గుర్తించారు. తెలంగాణ అమరవీరుల పథకం కింద 4 వందల 50 మందికి కుటుంబసభ్యులలో
ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. తరువాత మరో 126 మందికి అమరవీరుల
కుటుంబసభ్యుల్లో ఒక్కరికీ ఉద్యోగం కల్పించారు. మొత్తం 5 వందల 76 మందికి
ఉద్యోగాలు కల్పించారు. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. వారికి కష్టం
వస్తె ప్రభుత్వం తరుపున సహాయం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన
అమర వీరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను
స్మరించేందుకు హైదరాబాద్ లో ఒక మహాస్మృతి కేంద్రాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు
చేయాలని సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం
పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, 24 గంటలపాటు వెలుగుతూ ఉండే
మహా దీపకళిక స్థూపం నమూనాను ఖరారు చేశారు. 25 మంది ప్రఖ్యాత డిజైనర్లు,
ఆర్టిస్టులు కలిసి ఈ డిజైన్ రూపొందించారు. ప్రపంచంలో అపూర్వమైన రీతిలో
జ్వలించే మహా దీపకళిక రూపంలో ఈ అమరవీరుల స్థూపం ఉండేలా, స్మృతికేంద్రం
నిర్మాణం జరిగింది. హుస్సేన్‌సాగర్ తీరంలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే
అమరవీరుల స్మృతి కేంద్రాన్ని, ప్రమిద ఆకృతిలో డిజైన్ చేశారు. ఈ అపురూప
స్మారకానికి రూ.146 కోట్లకు పైగా ఖర్చయింది. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని
పూర్తిస్థాయిలో దుబాయ్ నుంచి 40 కంటెయినర్లతో తెప్పించిన స్టెయిన్లెస్
స్టీల్‌తో నిర్మించారు. సాధారణంగా ఆరు లేదా ఏడు అంతస్తుల భవనంతో ఇది సమానం.
ఇక్కడికి వచ్చినవారు కొంత సమయం గడిపేలా, తెలంగాణ ప్రాంత చరిత్ర, అమరవీరుల
త్యాగాలు తెలుసుకునేలా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరోసారి వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్ర ప్రగతికి సోపానాలు
తెలంగాణ రాక ముందు ఎట్లా ఉండే. ఇప్పుడు ఎట్లా ఉన్నది?అప్పటి పరిస్థితులు
ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. సాగు, తాగు నీళ్ళు లేవు. కరెంట్ ఉండేది కాదు.
రోడ్లు సరిగా లేవు. సంక్షేమం లేదు. అభివృద్ధి లేదు. కుల వృత్తులు ఆగమైనవి.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు. సీఎం కెసిఆర్ కి
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు. రాష్ట్రము ఏర్పడి పదేళ్లు అయిన మన పథకాలు,
అభివృద్ధి వల్ల దేశానికి ఆదర్శంగా నిలిచాం. సీఎం కెసిఆర్ ప్రగతి సంక్షేమ
కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. నేడు తెలంగాణ
అభివృద్ధి, సంక్షేమాల్లో ఒక మోడల్ గా దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
నిలిచింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే
ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానం. నేడు
తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే అందుకు
నిదర్శనం. 3.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 44,12,882 మందికి ప్రతి నెల ఆసరా
పెన్షన్లు అందిస్తున్నాం
కళ్యాణ లక్ష్మి (షాదీ ముబారక్
ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి
ఖర్చుల అవస్థలనుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ
పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ,
బీసీ, ఈబీసీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్
పథకాలన్నీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆడబిడ్డ పెండ్లి ఖర్చులకుగాను
రూ.1,00,116 ఆర్థికసాయం అందిస్తున్నది. దివ్యాంగులకు కళ్యాణలక్ష్మి పథకం కింద
రూ. 1,25,145 చెల్లిస్తున్నారు. 2014 నుండి 2023 మే మధ్య కాలంలో 12,71,839
నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు రూ 11,130 కోట్ల
రూపాయలకు పైగా ఖర్చు చేసింది.