ఏమిటంటే..
1.ఉలవల్లో ప్రోటీన్స్ ఎక్కువ. ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజాలు అధికం.
2. పెరిగే పిల్లలచే ఉడికించిన ఉలవలు తినిపిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
3. మూత్రాశయంలో రాళ్లను కరిగించి వెలుపలకు వచ్చేలా చేస్తాయి.
4.తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తీసుకుంటే తగ్గుతాయి.
5.మలవిసర్జణ సజావుగా, సాఫీగా జరుగుతుంది.
6.ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
7.ఒక కప్పు ఉలవచారుకి సమానంగా కొబ్బరి నీరు కలిపి తీసుకుంటే మూత్రంలో మంట
తగ్గుతుంది.
8.గుండె జబ్బులను తగ్గించడంలో ఉలవలు సహాయపడతాయి.
9.పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి.
10.పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి.
11.జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలకు ఉలవల కషాయం మంచిగా పనిచేస్తుంది.
12.ఉలవలు మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి.
చూశారుగా ఉలవలు తినటం వల్ల ఏన్ని ప్రయోజనాలు ఉన్నాయో..మీరు కూడా ఉలవలను మీ
ఆహారంలో భాగం చేసుకోండి.