మల్లాది, ఎమ్మెల్సీ రుహుల్లా
పశ్చిమ అభివృద్ధికై వెలంపల్లితో అడుగులో అడుగేసిన వైసీపీ శ్రేణి
విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి
శ్రీనివాసరావు జన్మదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ
అభివృద్ధికై వాక్ విత్ వెలంపల్లి 2కె మారథాన్‌ను స్థానిక భవానీపురంలోని
క్రాంబ్వే రోడ్డులో ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. వాక్‌కి ముందు
సాంస్క్రతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వాక్ మధ్యలో వైయస్సార్ పార్క్
నందు ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని
ఆవిష్కరించారు. అనంతరం కేకును కత్తిరించారు. 2కె రన్లో వెలంపల్లితో పాటు
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,
డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శ్రీశైలజా రెడ్డి, తూర్పు నియోజకవర్గ
పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొని నడిచారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ 2కె మారథాన్‌లో పాల్గొనడం సంతోషంగా
ఉందన్నారు. తమ స్నేహితుడైన వెలంపల్లి రెండుసార్లు పశ్చిమ నియోజకవర్గానికి
ఎమ్మెల్యేగా గెలుపొందారని రానున్న ఎన్నికలలో మూడో సారి అత్యధిక మెజారిటీతో
గెలుపొందుతారని, దానికి నిదర్శనమే ఈ 2కె రన్ అని పేర్కొన్నారు. పార్టీ
శ్రేణులు అందరూ రానున్న ఎన్నికలలో ఉత్సాహంగా పని చేసి వెలంపల్లి గెలుపునకు
కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిత్యం ఆలోచించే జగనన్న
బాటలో నడుస్తున్న వెలంపల్లితో పార్టీ శ్రేణులు వేలాది మంది పాల్గొనడం
సంతోషదాయకమన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన పుట్టిన రోజు
సందర్భంగా పార్టీ శ్రేణులు, ఆర్యవైశ్య ప్రముఖులు నిర్వహించిన 2కె మారథాన్
విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రానున్న
ఎన్నికలలో ఉత్తేజంగా పని చేసి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా
ఎగురవేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు అడపా
శేషు, బండి పుణ్యశీల, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, జిల్లా వక్ఫ్
బోర్డు అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు
పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి), ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు
కొనకళ్ల విద్యాధరరావు, కార్పొరేటర్లు పడిగపాటి చైతన్య రెడ్డి, గుడివాడ
నరేంద్ర, యారడ్ల ఆంజనేయ రెడ్డి, ఇర్ఫాన్, బాపతి కోటిరెడ్డి, మహాదేవు
అప్పాజీరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు పాల్గొన్నారు.