ఏ కూర వండినా అందులో తాలింపు వేసేటపుడు ఉల్లిగడ్డను తప్పనిసరిగా వాడుతుంటాం.
మార్కెట్ లో ఉల్లిగడ్డ ధర కొన్ని సందర్భాలలో ఎక్కువగా, మరి కొన్నిసార్లు
తక్కువగా ఉంటుంది.
ఏ సీజన్ లో అయినా ఉల్లిగడ్డను ప్రతి వంటలో వేయాల్సిందే.
ఎందుకంటే అది వేస్తేనే కూర రుచికరంగా ఉంటుంది. అందుకే ‘ఉల్లి చేసే మేలు తల్లి
కూడా చేయదు’ అనే సామెతఉంది.
అయితే ఉల్లిని అధికంగా తింటే దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
పరిమితికి మించి తింటే ఇందులోని ప్రొటీన్లు మనలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీన
పరుస్తాయి.
అంతేకాకుండా గుండెల్లో మంటకు ఇది కూడా ఒక కారణం అవుతుంది.
దీంతో పాటు వివిధ రకాల అలర్జీలు, చర్మ సమస్యలు, అనారోగ్యాలు ఎదురవుతాయని
ఆఫ్రికన్ హెల్త్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.
కావున ఉల్లిని అతిగా తినకపోవడమే ఉత్తమం