మెరుగుపడుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్షలతో పాటు నీటిని తాగడం ఉత్తమం. ఈ
నీటిని తాగడంతో అనేక సమస్యలు దూరం అవుతాయి.
*ప్రయోజనాలు:
1. కాలేయం ఆరోగ్యం:
ఉదయాన్నే ఎండుద్రాక్ష నీటిని తాగడంతో కాలేయం ఆరోగ్యంగా మారుతుంది. ఎండు
ద్రాక్ష నీరు శరీరంలో టాక్సిన్లను సులభంగా బయిటకు పంపుతుంది. ఈ నీరు రక్తాన్ని
సైతం శుభ్రపరుస్తుంది.
2. బరువు తగ్గేందుకు:
ఎండుద్రాక్ష నీటిని ఉదయమే తాగడంతో సులభంగా బరువు తగ్గవచ్చు. ఎండుద్రాక్షలో
ప్రక్టోజ్, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న ఫైబర్ కడుపు
నిండిన ఫీల్డ్‌ను అందిస్తుంది.
3. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది:
ఎండుద్రాక్ష నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్
ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి.
4. రక్తహీనత మాయం:
ఎండు ద్రాక్ష నీటిని తాగడంతో ఐరన్ లోపం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండు
ద్రాక్ష నీరు తాగడంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తహీనత నుంచి ఉపశమనం
లభిస్తుంది.
5. గుండె ఆరోగ్యం:
ఎండుద్రాక్ష నీటిని తాగడంతో గుండె ఆరోగ్యంగా మారుతుంది. ఇది రక్తాన్నిశుద్ధి
చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
6. ఎసిడిటీ:
ఎండు ద్రాక్ష నీటిని తాగడంతో ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీటిని
తాగడంతో కడుపులో ఆమ్ల స్థాయిలు తగ్గుతాయి.
7. వ్యాధినిరోధక శక్తి:
ఎండుద్రాక్ష నీటిని తాగడంతో వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న
యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.
8. బలమైన ఎముకలు:
ఎండు ద్రాక్ష నీటిలో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా మార్చడంలో
సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో కాల్షియం కూడా లభిస్తుంది.