16 లేదా ఆలోపు తొలి విడత సీట్ల కేటాయింపు
కొత్త సీట్లు అందుబాటులోకి రావడమే కారణం
హైదరాబాద్ : ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ తేదీల్లో స్వల్ప మార్పులు
జరిగాయి. తాజాగా ప్రభుత్వం 14,565 బీటెక్ సీట్లకు అనుమతి ఇవ్వడంతో
విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవాల్సి
ఉంటుంది. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఆప్షన్లకు ఈనెల 8వ తేదీ వరకే
గడువుంది. ఈక్రమంలోనే 12వ తేదీ వరకు పొడిగించారు. స్లాట్ బుకింగ్,
ధ్రువపత్రాల పరిశీలన తదితరాలకూ గడువు పొడిగించారు. జులై 22నాటికి తొలి విడత
కౌన్సెలింగ్ ముగుస్తుంది. రెండో విడత కౌన్సెలింగ్ జులై 24 నుంచి ఆగస్టు 2
వరకు జరుగుతుంది. చివరి విడత ఆగస్టు 4 నుంచి 11 వరకు నిర్వహిస్తారు.
తొలి విడత కౌన్సెలింగ్ కాలపట్టిక : 7, 8 తేదీలు: స్లాట్ బుకింగ్‌కు అవకాశం,
9న: ధ్రువపత్రాల పరిశీలన, 12వరకు: వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 16వ తేదీ
లేదా ఆలోపు : సీట్ల కేటాయింపు, 16-22 వరకు: ఫీజు చెల్లింపు, ఆన్లైన్లో
సెల్ఫ్ రిపోర్టింగ్
పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ తేదీల్లో మార్పు : రాష్ట్రంలో 11 ప్రైవేట్
పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్తగా సీట్లకు, నూతన కోర్సులకు ప్రభుత్వం
అనుమతిచ్చిన నేపథ్యంలో పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు మారాయి. ఈనెల
8, 9 తేదీల్లో కొత్తగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. వారికి 10న ధ్రువపత్రాల
పరిశీలన జరుగుతుంది. ఈనెల 8-11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
వారికి 14న సీట్లు కేటాయిస్తారు. తొలిసారిగా పాలిసెట్‌లో స్లైడింగ్
విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆ ప్రక్రియ ఈనెల 19, 20 తేదీల్లో
నిర్వహిస్తారు. విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో బ్రాంచీలు మారినా ఫీజు