మళ్లీ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలి
నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలి
మాండూస్ తుపాను, భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమీక్ష
గుంటూరు : మాండూస్ తుపాను, భారీ వర్షాలపై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.
ఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్లకు
సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సందర్భంగా సీఎం
జగన్ మాట్లాడుతూ కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో
వ్యవహరించాలి. ఎన్యుమరేషన్ విషయంలో ఉదారంగా వ్యవహరించండి. ఎక్కడా కూడా
రైతులు నిరాశకు గురికాకూడదు. రంగు మారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు
చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదు. తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా
వినిపించకూడదు. ఒకవేళ రైతులు తాము బయట అమ్ముకుంటున్నామన్నా సరే కూడా వారికి
రావాల్సిన రేటు వారికి రావాలి. ఆ రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యతకూడా మనది.
తుపాను, దీని ప్రభావం వల్ల వర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు అందరూ
దీనికోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు.*
పంటలు దెబ్బతిన్నచోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు
అందించాలి. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే ఆ కుటుంబానికి రూ.2వేల
రూపాయలతోపాటు, రేషన్ అందించాలి. ఇంట్లోకి నీళ్లు వచ్చినా సరే ప్రభుత్వం
పట్టించుకోలేదనే మాట రాకూడదని సూచించారు. నీళ్లు ఇంటిలోకి వచ్చి ఉంటే
కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాల్సిందేనాని, ఈ విషయాన్ని కలెక్టర్లు అంతా
దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా ఈ సహాయాన్ని
బాధితులందరికీ అందించాలని, గోడకూలి ఒకరు మరణించారన్న ఘటన జరిగినట్టుగా
సమాచారం వచ్చింది. వారికి కూడా పరిహారం వెంటనే అందించాలని, వారంరోజుల్లో ఈ
సహాయం అంతా వారికి అందాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పశువులకు నష్టం
జరిగినా సరే వారికి కూడా పరిహారం సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలి.
నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించాలి. వచ్చే వారంరోజుల్లో ఈ
ప్రక్రియ ముగించాలని ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.