రాపూరు (వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని రాపూరు లో టిడిపి మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పచ్చిగళ్ళ రత్నయ్య ,ఏదోటి కోటి నాయుడు, పరంధామ రెడ్డి మోహన్,జనసేన వీరమహిళ కొండాపురం కస్తూరి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.