కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని
అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ – కొరటాల
కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో
సహజంగానే ఈ ఇద్దరి కాంబోగా రానున్న సినిమా అందరిలో ఆత్రుతను పెంచుతోంది.ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ ఎన్టీఆర్ వ్యక్తిగత
కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కాస్త ఫ్రీ అయ్యాడు.
అందువలన ఈ నెల 23వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు
సమాచారం. రెగ్యులర్ షూటింగును ఈ నెల 30 నుంచి మొదలుపెడతారట.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెట్స్ ను వేయించారని
అంటున్నారు. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చిత్రీకరణతో ఫస్టు షెడ్యూల్
మొదలు కానుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో తలపడే విలన్ పాత్రలో ‘సైఫ్ అలీ ఖాన్’
కనిపించనున్నాడని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను 9 భాషల్లో
రిలీజ్ చేయనున్నారని సమాచారం.