జగన్మోహన్రెడ్డి సమావేశామయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం
ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాంత్రీయ సమన్వయకర్త అయోధ్యరామిరెడ్డి, కృష్ణా
జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్
దేవినేని అవినాష్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా
మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో
పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం
అవుతున్నాం. కార్యకర్తలను కలుసుకోవడం దీని వెనుకున్న ఉద్దేశం. అంతేకాకుండా
మరో 14–15 నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. గడపగడపకూ కార్యక్రమం ద్వారా మనం
ప్రజల్లో మమేకం అవుతున్నాం. ఎక్కడైనా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే వారికి
కూడా మంచి జరగాలి. దేవుడి దయతో మంచి పనులన్నీ చేయగలిగామని ప్రతి అక్కకూ, ప్రతి
చెల్లెమ్మకూ వివరించాలి. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. సచివాలయాల వారీగా
కన్వీనర్లు, అలాగే ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి
నియమింపచేస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ
ముందుకు వెళ్తాం. గృహసారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. ప్రజలతో
పార్టీ క్యాడర్ మమేకం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశాం. ప్రతి
అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం. అందుకనే
రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది. కుప్పంలాంటి చోట్ల
మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80
శాతానికి పైగా క్లీన్ స్వీప్ చేయగలిగామన్నారు.
విజయవాడ ఈస్ట్‌లో కూడా 21 వార్డుల్లో 14 చోట్ల గెలిచాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే
ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం. మార్పు అనేది ప్రస్ఫుటంగా
కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. ఏమైనా
సమస్యలు ఉంటే మనంలో మనం సర్దుబాటు చేసుకుందాం. కచ్చితంగా 175 కి 175 సీట్లు
గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. వార్డులోకి వెళ్లినా,
గ్రామంలోకి వెళ్లినా ప్రతి ఇంట్లోకూడా సంతోషం కనిపిస్తోంది. మన ప్రాంతంలో
స్కూళ్లు మారుతున్నాయి, చదువులు మారుతున్నాయి, ఆస్పత్రులు మారుతున్నాయి.
ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది. ఇంత మార్పు అన్నది ఎప్పుడూ కూడా
జరగలేదు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా
పూర్తిస్థాయిలో వస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం
తీసుకొచ్చిన మార్పులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ
ఎన్నికలకు మనం అంతా కలిసి కట్టుగా పనిచేయాలని, ఎలాంటి విభేదాలున్నా
పక్కనపెట్టాలని, ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి
కోరారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ
సమన్వయకర్త దేవినేని అవినాష్, వైయస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు
వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.