స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు
టీడీపీ, బీజేపీ, జనసేన వల్ల ఒరిగిందేమీ లేదు..
మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమ విప్లవం..
గడప గడపకు మన ప్రభుత్వం లో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అనంతపురం నగరంలో జరిగిన అభివృద్ధి
శూన్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
అప్పట్లాగే అభివృద్ధి జరగకుండా ఇప్పుడూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదని స్పష్టం
చేశారు. అనంతపురం నగరంలోని 20వ డివిజన్లో కార్పొరేటర్ లావణ్యతో కలిసి
మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలను
వివరిస్తూనే స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు
తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు శరవేగంగా
అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. డ్రెయినేజీలు, రోడ్ల నిర్మాణాలకు
ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలతో పాటు
జనరల్, ప్రత్యేక నిధులతో పనులు చేపడతామన్నారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి
జగన్‌పై ప్రతిపక్షాల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు
ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు.
2014లో అధికారంలోకి వచ్చాక విభజన హామీలను ఎందుకు పట్టించుకోలేదని
ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు
సాధించుకునే విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ఆనాడు తన
వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్నారు.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో
మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, మార్కెట్‌యార్డు
చైర్మన్ ఫయాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్‌బేగ్, నగర
పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ
నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.