విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) నూతన
సంవత్సరం డైరీ -2023ను శుక్రవారం విజయవాడ వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్
పోలీస్ కె.హనుమంతరావు ఆవిష్కరించారు. వన్‌టౌన్‌లోని ఎసిపి కార్యాలయంలో జరిగిన ఈ
కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర నాయకులు షేక్ ఖాజావలి, విజయవాడ నగర
అధ్యక్ష కార్యదర్శులు కలిమి శ్రీ, ఎం.బి.నాథన్, నగర నాయకులు శేఖర్, బాషా,
పశ్చిమ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.నరేంద్రకుమార్, వి.యు.ఫణికుమార్,
నాయకులు ఎ.శ్రీనివాస్, పోతిన వాసు, కె.శ్రీనివాసరావు, రావు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఎసిపి హనుమంతరావు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులకు ఒక విశిష్ట
స్థానం ఉందన్నారు. సోషల్ మీడియాలో వార్తలను క్రాస్ చెక్ చేసుకుని ఇస్తే
బాగుంటుందని సూచించారు. అలాలేకపోతే ఫేక్ వార్తలు కూడా వైరల్‌గా మారి సమాజానికి
తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఏదైనా వ్యవహారాలకు
సంబంధించి వార్తలుగానీ, కథనాలుగానీ సంబంధిత అధికారి వివరణతో ఇస్తే సమగ్రంగా
ఉంటుందని పేర్కొన్నారు.