హైదరాబాద్ : ఎమ్మెల్యేలకు ఎరకేసులో ప్రభుత్వ అప్పీలుపై విచారణను హైకోర్టు
రేపటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్గా విచారణ చేపడతామని
పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలుపై విచారణను
హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది దుష్యంత్
దవే ఆన్లైన్లో వాదనలు వినిపించారు. అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటలకు
వర్చువల్గా విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. భారాస ఎమ్మెల్యేలకు ఎర కేసు
దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీఎం
మీడియా సమావేశం ఆధారంగా ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయడం తగదని
ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. కేంద్రం పరిధిలోని సీబీఐకి కేసును
అప్పగించడమంటే కేసు అవసరం లేదనట్లేనని అప్పీలులో ప్రభుత్వం తెలిపింది.