ఎమ్మెల్యేలు ఎవరనేది గుర్తించినట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ
రెడ్డి వెల్లడించారు. తమకు అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది కాబట్టే
7 సీట్లకు పోటీపడినట్లు సజ్జల వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు
ప్రలోభ పెట్టారని సజ్జల ఆరోపించారు. ఎక్కడ లోపం ఉందో విశ్లేషించి చర్యలు
తీసుకుంటామని సజ్జల పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఉత్కంఠ రేపుతూ వచ్చిన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మెుత్తం ఏడు స్థానాలకు
జరిగిన ఎన్నికల్లో వైసీపీ అనుకున్నట్లుగా ఏడు సీట్లు గెలుచుకోలేకపోయింది.
టీడీపీ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఆ ఓక్క సీటు కైవసం చేసుకోని అధికార
పార్టీలో కలవరాన్ని పెంచింది.గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
వైసీపీ అభ్యర్థులు సూర్యనారాయణ రాజు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయేలు,
చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్ జయమంగళ విజయం సాదించారు. టీడీపీ అభ్యర్థి
పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చిన తరువాత విజయం సాధించినట్లు అధికారులు
ప్రకటించారు. అయితే, వైసీపీ అభ్యర్థన మేరకు అధికారులు ఓట్లను మళ్లీ
లెక్కించారు. రెండో సారి లెక్కింపులో సైతం పంచమర్తి అనురాధ విజయం సాదించడంతో 6
ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ, 1 స్థానంలో టీడీపీ విజయం సాధించి నట్లయింది.సజ్జల
రామకృష్ణ రెడ్డి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి
ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఎవరనేది గుర్తించినట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల
రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి
వ్యతిరేకంగా ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని
పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబే ప్రలోభ పెట్టారని సజ్జల
ఆరోపించారు. తిరుగుబాటు బావుట ఎగరవేసిన ఇద్దరు వైసీపీ సభ్యులను పరిగణనలోకి
తీసుకోలేదని సజ్జల రామకృష్ణ తెలిపారు. తమకు అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యా
బలం ఉంది కాబట్టే 7 సీట్లకు పోటీపడినట్లు సజ్జల వెల్లడించారు. తమ తరుపునుంచి
ఎక్కడ లోపం ఉందో విశ్లేషించి చర్యలు తీసుకుంటామని సజ్జల పేర్కొన్నారు. తమ
పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందని అనుకోవట్లేదని సజ్జల తెలిపారు. ఎవరైనా
అసంతృప్తిగా భావిస్తే వారిని పిలిచి ఆయా సమస్యలపై మాట్లాడతామన్నారు.
అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇదేమి ఉద్యోగం
కాదని సజ్జల హితవు పలికారు.