ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి : ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నేటి ఉదయం 9 గంటలకు
వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తులో ప్రారంభమైన
ఎన్నికల ప్రక్రియ. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు
హక్కును వినియోగించు కోవడంతో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ. తదుపరి ఉప మంత్రి
(ఆబ్కారీ) నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్,
దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును
వినియోగించుకున్నారు. మొత్తం 175 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటివరకు 35 మంది తమ ఓటు
హక్కును వినియోగించుకున్నారు.