బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
చిత్తూరు : తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికలలో
భాగంగా చిత్తూరు పార్లమెంటు పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాణి మండల ముఖ్య
కార్యకర్తల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా
పని చేయాలని బిజెపి శ్రేణులు కు పిలుపునిచ్చారు. చిత్తూరు పార్లమెంటు పలమనేరు
నియోజకవర్గం పరిధిలోని పెద పంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన
పథకంలో విద్యార్థులకు ఏవిధంగా మెనూ ఉన్నది పరిశీలించిన సోము వీర్రాజు
విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల
కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పధకాలను వివరించారు.