సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
విజయవాడ : రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యాశాఖ కార్యదర్శి
ప్రవీణ్‌ప్రకాష్, ఎన్సిఈఆర్టి డైరక్టర్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ
కల్పలతారెడ్డిల జోక్యాన్ని నియంత్రించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి
శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ఆయన
మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారిలో మానసిక వికాసాన్ని
పెంపొందించాల్సిన ఉపాద్యాయులను ఆ పనిని చేయనీయకుండా నాడు`నేడు పనులంటూ,
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు
పాల్పడుతోందని విమర్శించారు. ఎంఇఓలు, డిఇఓలు చేయాల్సిన పాఠశాల తనిఖీలను
ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్‌ప్రకాష్ చేస్తూ ఉపాధ్యాయులను భయభ్రాంతులకు
గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న ఈ
వేధింపులను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు.