విభాగాన్ని మరింత పటిష్ట పరిచి, ఆ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల
పరిష్కారానికి ఉద్యమాలను ఉధృతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల
సంఘం(టీయూడబ్ల్యూజే) పిలుపునిచ్చింది. ఆదివారం బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే
కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అధ్యక్షతన,
రాష్ట్ర స్థాయి ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యుల సమావేశం జరిగింది. ఇటీవల అకాల
మరణం చెందిన సీనియర్ పాత్రికేయులు జహీర్ అలీ ఖాన్,
సి.హెచ్.ఎం.వి.కృష్ణారావులతో పాటు ప్రజా గాయకులు గద్దర్ కు నివాళి అర్పిస్తూ
సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.
సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ, దొంతు రమేష్, ఉప ప్రధాన
కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్టులు
రమేష్ వైట్ల, కల్కురి రాములు, మెట్రో చంద్ర శేఖర్, విష్ణు, ఖదీర్, అహ్మద్,
దుర్గారెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు ఏ.రాజేష్, హెచ్.యు.జె అధ్యక్ష,
కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, షౌకత్ హమీద్, వనపర్తి, సిరిసిల్లా, సిద్దిపేట
జిల్లాల అధ్యక్షులు మధుగౌడ్, సంతోష్, కే. రంగాచారీ, నిజామాబాద్ జిల్లా
అధ్యక్ష, కార్యదర్శులు సంజీవ్, అరవింద్ బాలాజీల తో పాటు రాష్ట్రంలోని వివిధ
జిల్లాల నుండి దాదాపు 100మంది ఎలక్ట్రానిక్ మీడియా విభాగం ముఖ్య నాయకులు
హాజరయ్యారు.
తీర్మానాలు
————-
– తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా
– అసోసియేషన్ (తేమ)ను మరింత పటిష్టం చేయాలి.
– 33 జిల్లాల్లో కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
– సభ్యత్వాల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి
– రిపోర్టర్లు, వీడియో ఎడిటర్లు,
కాపీ ఎడిటర్లు, న్యూస్ ప్రెజెంటర్లకు
సభ్యత్వాలు కల్పించాలి.
– వీలైనంత తొందరలో హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలి.
సన్నాహక కమిటీ : రాష్ట్ర సదస్సు నిర్వహణకు సంబంధించి సీనియర్లతో సన్నాహక
కమిటీని సమావేశం ఎంపిక చేసింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేష్, ఉప ప్రధాన
కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు ఈ కమిటీకి ముఖ్య సలహాదారులుగా
వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా రమేష్ వైట్ల (హైదరాబాద్), కల్కురి రాములు
(హైదరాబాద్), చంద్రశేఖర్(హైదరాబాద్), శిగా శంకర్ గౌడ్ (హైదరాబాద్),
నరేందర్(ఉమ్మడి రంగారెడ్డి), విక్రమ్ రెడ్డి(ఉమ్మడి రంగారెడ్డి), వి.వి.రమణ
(ఉమ్మడి వరంగల్), కెకె(ఉమ్మడి వరంగల్), విద్యాసాగర్(ఉమ్మడి వరంగల్), బొబ్బిలి
నర్సయ్య (ఉమ్మడి నిజామాబాద్), వెంకట్రావ్(ఉమ్మడి ఖమ్మం), ఖదీర్(ఉమ్మడి ఖమ్మం),
ఈద మధుకర్ రెడ్డి(ఉమ్మడి కరీంనగర్), కే.చంద్రశేఖర్ (కరీంనగర్), యు.రవీందర్
(ఉమ్మడి కరీంనగర్), దుర్గారెడ్డి(ఉమ్మడి మెదక్), విష్ణు(ఉమ్మడి మెదక్),
అహ్మద్(ఉమ్మడి మహబూబ్ నగర్), శ్రీనివాస్ (ఉమ్మడి నల్లగొండ), మల్లేశం(ఉమ్మడి
నల్లగొండ), మాంతయ్య (ఉమ్మడి ఆదిలాబాద్)లు ఎంపికయ్యారు.